అశ్వారావుపేట తహశీల్ధార్ గా క్రిష్ణ ప్రసాద్ 

నవతెలంగాణ – అశ్వారావుపేట

నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మండలానికి ఎట్టకేలకు జిల్లా కలెక్టర్ ప్రియాంక అల తహశీల్దార్ ను నియమించారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా జరిగిన బదిలీల్లో చుంచు పల్లి తహశీల్దార్ గా పనిచేస్తున్న ఖమ్మం కేడర్ కు చెందిన తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్ ను భద్రాచలం బదిలీ చేసారు.ఆయన అక్కడ విధుల్లో చేరకుండా సెలవు పెట్టినట్లు సమాచారం.కాగా నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో 15 రోజులుగా తహశీల్దార్ లేకుండానే పాలన సాగింది.ప్రభుత్వం పథకాలు అమలు చేస్తున్న నేపథ్యంలో అనేకమంది ఆశావాహులు దృవీకరణ పత్రాలు కోసం దరఖాస్తు చేసుకున్నారు.అవి గుట్టలు గుట్టలు గా పేరుకు పోతున్నాయి.ఈ క్రమంలో క్రిష్ణ ప్రసాద్ అశ్వారావుపేట కు మారుస్తూ సోమవారం కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసారు.
Spread the love