ముంపు బాదితులకు పురావాసం కల్పిస్తాం : కలెక్టర్ ఇలా త్రిపాఠి

గౌరారంవాగు ముంపు ప్రాంతాన్ని పరిశీస్తున్న కలెక్టర్
గౌరారంవాగు ముంపు ప్రాంతాన్ని పరిశీస్తున్న కలెక్టర్

– గౌరారంవాగు ముంపు ప్రాంతంలో పర్యటన
– ప్రభుత్వ ఆసుపత్రిలో డెంగ్యూ టెస్టు

నవతెలంగాణ-మంగపేట: ఇటీవల కరిసిన భారీ వర్షాల వరదలకు మండల కేంద్రంలోని గౌరారంవాగు పొంగిపొర్లడంతో ముంపుకు గురైన వడ్డెర కాలనీ, ముస్లీంవాడ, పొద్మూరు బాదితులకు ఇల్ల స్థలాలు ఇచ్చి పునరావాసం కల్పిస్తామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి భాదితులకు భరోసా ఇచ్చారు. శుక్రవారం గౌరారంవాగు కొత్త బ్రిడ్జీ ప్రాంతంలో పర్యటించి ముంపు బాదితులైన మిర్చీ నారుమల్ల రైతులు, ఇల్లు మునిగిన బాదిత కుటుంబాల వివరాలను డిప్యూటీ తహసీల్దార్ మల్లేశ్వరరావు, ఆర్ఐ కుమారస్వామిలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ ఆసుపత్రిలో పరిసరాలను పరిశీలించి వైద్యుడు నరేష్ తో మాట్లడారు.

వర్షాకాలం సీజన్ ముగిసే వరకు ఆసుపత్రిలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా మెయింటెన్ చేయాలని వైద్యుడు నరేష్ ను ఆదేశించారు. అదే విధంగా ఆసుపత్రి పరిధిలోని గ్రామాల్లో జ్వరాల నియంత్రణకు ఉచిత వైద్య శిభిరాలు నిర్వహించి వైద్య సిబ్బంది గ్రామాల్లో అందుబాటులో ఉండి ఇంటింటి సర్వే చేపట్టి జ్వర పీడితుల రిపోర్టు తయారు చేసి వైద్యాధికారులకు అందజసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం స్టాకు రిజిష్టర్ పరిశీలించిన కలెక్టర్ ఆసుపత్రిలో డెంగ్యూ టెస్టు చేయించుకున్నారు. కార్యక్రమంలో ఎంపిడిఓ శ్రీధర్, డిప్యూటి తహసీల్దార్ మల్లేశ్వరరావు, ఆర్ఐ కుమారస్వామి, ఎంపీఓ పి.శ్రీనివాస్, వైద్యుడు నరేష్ రెవిన్యూ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

 

Spread the love