రజక కార్పొరేషన్ చైర్మెన్ దాసరాజుల అజయ్‌కుమార్
రజక వృతిదారుల సమస్యలపై
రౌండ్‌టేబుల్ సమావేశం
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ తీర్మానం
నవతెలంగాణ-ముషీరాబాద్
రజక వృత్తిదారుల సమస్యలు పరిష్కరిస్తామని రజక కార్పొరేషన్ చైర్మెన్ దాసరాజుల అజయ్‌కుమార్ అన్నారు. బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు ఎదునూరి మదర్ అధ్యక్షతన రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫైళ్ల ఆశయ్య పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు. రజక వృత్తిదారుల సంక్షేమానికి ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని తీర్మానించారు. రజక వృత్తిదారులకు రూ.10 లక్షల ఆర్థిక పథకం, ప్రతి జిల్లాలో మోడ్రన్ దోబీఘాట్ల నిర్మాణం, ఉచిత విద్యుత్ బకాయిల చెల్లింపు, రజకులపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలను అరికట్టేందుకు ప్రత్యేక రక్షణ చట్టం, ట్యాంక్‌బండ్‌పై వీరనారి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం చైర్మెన్ దాసరాజుల అజయ్‌కుమార్, వైస్ చైర్మెన్ బంగారు బాబు, విద్యుత్ అధికారి చౌదరి శ్రీనివాస్, అశోక్‌కుమార్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రజక వృత్తిదారుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. సమావేశంలో ప్రవేశపెట్టిన తీర్మానాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తగిన సహకారం అందిస్తామని అజయ్‌కుమార్ హామీ ఇచ్చారు. నూతన సొసైటీల ఏర్పాటుకు ఆన్‌లైన్ ద్వారా సభ్యులను చేర్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉచిత విద్యుత్ పథకం అందని వారికి కూడా వర్తించేలా ప్రభుత్వంతో మాట్లాడుతానన్నారు. రజకులపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతానని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి అన్నార వెంకటేశ్వర్లు, నాయకులు బాలాపూర్ బాలరాజు, పాయిరాల రాములు, మరియాల గోపాల్, పెద్దాపురం భాస్కర్, సి. వెంకటస్వామి, అవనగంటి స్వామి, లక్ష్మీనారాయణ, యాదయ్య, జంగయ్య, యాదమ్మ, భాగ్య, బాత్ రాజు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
రజక వృత్తిదారుల సమస్యలు పరిష్కరిస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



