చామలకు ఘన స్వాగతం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
భువనగిరి పార్లమెంట్‌ కాంగ్రెస్‌అభ్యర్థిగా ఎంపికైన చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డికి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అభ్యర్థిగా ఆ పార్టీ అధిష్టానం ఆయన్ను ప్రకటించడంతో చామల గురువారం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ రాజీవ్‌ గాంధీ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు డప్పు వాయిద్యాలతో పూలమాలలు వేసి పుష్పగుచ్చాలు ఇచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Spread the love