రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం – డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల

– కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోండి
– జడ్పీ చైర్‌ పర్సన్‌ కమల్‌ రాజు
నవతెలంగాణ-బోనకల్‌
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసమే పని చేస్తుందని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్‌ కూరాకుల నాగభూషణం రైతుల కోసం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ లింగాల కమల్‌ రాజు కోరారు. మండల పరిధిలోని పెద్దబేరువల్లి బ్రాహ్మణపల్లి, మోటమర్రి సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను కూరాకుల నాగభూషణం లింగాల కమల్‌ రాజు గురువారం ప్రారంభించారు. పెద్ద బీరవల్లి సహకార సంఘంలో పెద్ద బీరవల్లి సహకార సంఘం అధ్యక్షుడు చింతలచెరువు కోటేశ్వరరావుతో బ్రాహ్మణపల్లిలో ఆ సంఘం అధ్యక్షుడు ఏనుగు నాగేశ్వరరావులతో కలిసి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని వారు అన్నారు. రైతు నుంచి ప్రతి ధాన్యం, మొక్కజొన్నలను ప్రభుత్వమే ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతుల ఎవరు ప్రైవేటు వ్యాపారులను నమ్మి నష్టపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోని తమ ధాన్యం, మొక్కజొన్నలను అమ్ముకోవాలని కోరారు. ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధి కోసం పనిచేస్తుందన్నారు. రైతులు ప్రైవేట్‌ వ్యాపారులను నమ్మి నష్టపోతున్నారని అందుకోసమే మండలంలోని అన్ని సహకార సంఘాల ఆధ్వర్యంలో మార్కపెడ్‌ ద్వారా కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
అనంతరం పెద్ద బీరవల్లి గ్రామంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్‌ సిఫారసుతో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్‌ రాజు చొరవతో మంజూరైన 5,55,500 రూపాయల విలువ చేసే 16 సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను నేరుగా లబ్ధిదారులకు వారు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘాల సీఈఓలు చేపూరి నాగరాజు, దారెల్లి అశోక్‌ రైతుబంధు మండల కన్వీనర్‌ వేమూరి ప్రసాద్‌ రావు, పెద్ద బీరవల్లి బ్రాహ్మణపల్లి సర్పంచులు ఆళ్ల పుల్లమ్మ, జెర్రిపోతుల రవీంద్ర బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జున రావు, మోటమర్రి సొసైటీ అధ్యక్షులు బోజెడ్ల పుల్లారావు, సొసైటీ సీఈవో కృష్ణారావు, డైరెక్టర్లు, రావినూతల సర్పంచ్‌ కొమ్మినేని ఉపేందర్‌ బీఆర్‌ఎస్‌ నాయకులు రెడ్డి బోయిన ఉద్దండు, కాకాని శ్రీనివాసరావు, బంధం శ్రీనివాసరావు, తమ్మారపు బ్రహ్మయ్య, గాదె నర్వోత్తమ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్నారు.

 

Spread the love