సంక్షేమ పథకాలే బాజిరెడ్డి గెలిపుకు నాంది..

– ఐడిసిఎంఎస్ చైర్మన్ సాంబార్ మోహన్ ఎంపీపీ బాదవత్ రమేష్ నాయక్,బీఆర్ఎస్ నాయకులు..
నవతెలంగాణ-డిచ్ పల్లి : బీఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన పదేళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే మూడవసారి బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయని నిజామాబాద్ రూరల్ బిఅర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గెలుపు కు నాంది అని ఐడిసిఎంఎస్ చైర్మన్ సాంబార్ మోహన్, ఎంపీపీ బాదవత్ రమేష్ నాయక్, జడ్పీ టీసి సుమన రవిరెడ్డి, దాసరి ఇందిరా లక్ష్మీ నర్సయ్య,డిచ్ పల్లి, ఇందల్ వాయి బిఅర్ఎస్ మండలల అధ్యక్షులు చింత శ్రీనివాస్ రెడ్డి, చిలువెరి దాస్,లోలం సత్యనారాయణ అన్నారు.  బుధవారం డిచ్ పల్లి,ఇందల్ వాయి మండల కేంద్రంలలో వారు మాట్లాడుతూ గత పాలకులు 45 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించారని, అప్పుడు జరగని అభివృద్ధి గడిచిన పదేళ్లలో ఎంతో జరిగిందని గుర్తు చేశారు. ఎన్నికల వేళ గ్రామాల్లోకి వచ్చి లెక్కకు మించిన
హామీలను ఇచ్చి అమలు చేస్తామని ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ప్రజలు నమ్మే స్థితిలో లేరని, వారికి ఓటు వేయరని స్పష్టం చేశారు. మూడవ సారి సిఎం కేసీఆర్, నిజామాబాద్ రూరల్ లో బాజిరెడ్డి గోవర్ధన్ హ్యాట్రిక్ సాధించబోతు న్నారని, ఇదివరకే ప్రతిపక్ష పార్టీలు గుర్తించి ఓటమి చెందుతామన్న భయంతో బీఆర్ఎస్ పార్టీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. తొమ్మిదేళ్ల పాటు అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల ముంగిట్లోకి తెచ్చిన కేసీఆర్ను మూడవసారి ముఖ్యమంత్రి కావలంటే రూరల్ నియోజకవర్గ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని వారు పిలుపునిచ్చారు. నేడు జరిగే పోలింగ్లో అన్ని వర్గాల ప్రజలు హాజరై కారు గుర్తుకు ఓటు వేసి బాజిరెడ్డి గోవర్ధన్ను గెలిపించుకోవాలని కోరారు. సమావేశంలో సీనియర్ నాయకులు దాసరి లక్ష్మీనర్సయ్య,శక్కరికొండ కృష్ణ, ఒడ్డెం నర్సయ్య, గజావడ జైపాల్, మోహన్రెడ్డి, దండుగుల సాయిలు, ఆమీర్, కృష్ణ, నయీం, అంజయ్య, రవికీరణ్, పద్మారావు, నల్లవెల్లి సాయిలుతదితరులున్నారు.
Spread the love