శాంతి ఒప్పందంపై
ఇజ్రాయిల్‌లో తీవ్ర వ్యతిరేకత
అంగీకరించేది లేదంటూ మంత్రుల ప్రకటనలు
గొంతు కలుపుతున్న ప్రతిపక్షం
అయోమయంలో నెతన్యాహూ
టెల్ అవీవ్ : అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూను తీవ్ర అసహనానికి గురిచేసింది. ఒప్పందం కుదిరిం దంటూ గత ఆదివారం రాత్రి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి నెతన్యాహూకు ఫోన్ వచ్చింది. లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయిల్ జరుపుతున్న దాడుల విషయంలో ట్రంప్ ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. నెతన్యాహూకు విచక్షణే లేదని నిందించారు. ఫిబ్రవరి చివరలో ఇజ్రాయిల్‌తో కలిసి ఇరాన్‌పై మొదలు పెట్టిన యుద్ధం ముగిసిందని తెలిపారు. 2015లో ఇరాన్‌తో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని కూడా నెతన్యాహూ ఆ సమ యంలో బాహాటంగానే తిరస్కరిం చారు. తాజాగా ఇజ్రాయిల్ అధికా రులు, నాయకులు గత కొంత కాలంగా ఏ విషయంపై భయాం దోళనలు వ్యక్తం చేస్తున్నారో ఇప్పుడు అదే నిజమైంది. అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం టెహ్రాన్‌పై అగ్రరాజ్యం విధించిన ఆంక్షలు తొలగిపోతాయి. తాను ఏ ప్రభుత్వాన్ని అయితే కూల దోయాలని నెతన్యాహూ అను కున్నారో ఆ సర్కారుకే అమెరికా ఆర్థిక ఉపశమనాన్ని కల్పించడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా ఇరాన్ అణు కార్యక్రమం, బాలిస్టిక్ క్షిపణి నిల్వలపై ఈ ఒప్పందంలో ఎలాంటి ప్రస్తావన లేకపోవడం ఆయనను కలవరపెడు తోంది. నెతన్యాహూ సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఒప్పందం గురించి ఏమీ మాట్లాడలేదు.
అదే సమయంలో తన మిత్రుడు ట్రంప్ పేరును కూడా ఎత్తలేదు. ట్రంప్‌కు, తనకు మధ్య అభిప్రాయబేధాలు ఉన్న సందర్భాలు ఉన్నాయని, అయితే ఇజ్రాయిల్ భద్రతా ప్రయోజనాలే తనకు ముఖ్యమని ఆయన విలేకరుల ప్రశ్నలకు జవాబుగా చెప్పారు. దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయిల్ సేనలు పూర్తిగా వైదొలగాలని ఇరాన్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ ఒప్పందం ఇజ్రాయిల్ చేతులు కట్టేయవచ్చు. అయితే అందుకు తాను సుముఖంగా లేనని ఇజ్రాయిల్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఆత్మరక్షణ హక్కు తమకు ఎప్పటికీ ఉంటుందని ఓ అధికారి తెలిపారు. ఒప్పందానికి ఇజ్రాయిల్ కట్టుబడి ఉండే ప్రశ్నే లేదని కొందరు మంత్రులు బహిరంగంగానే చెప్పారు. శాంతి ఒప్పందాన్ని ఇజ్రాయిల్ మాజీ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ ఓ ప్రమాద కరమైన మలుపుగా అభివర్ణిం చారు. ప్రధాని పదవికి పోటీ పడుతున్న ఇజ్రాయిల్ మాజీ సైన్యాధ్యక్షుడు గాడి ఐసెన్‌కోట్ కూడా దీనిపై విమర్శలు కురిపించారు. అయితే నెతన్యాహూ మాత్రం ఇప్పటి వరకూ ఈ ఒప్పందంపై ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. ఏదేమైనా మధ్య ప్రాచ్యంలో యుద్ధాన్ని ముగించేం దుకు జరిగిన చర్చలు ట్రంప్, నెతన్యాహూ మధ్య విభేదాలు సృష్టించాయి. ఇజ్రాయిల్‌లో ట్రంప్ మద్దతుదారుల సంఖ్య ఇటీవలి కాలంలో బాగా పడిపోయింది. నెతన్యాహూ శిబిరంలో ఉన్న వారు కూడా ట్రంప్ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజా పరి ణామాలను తమకు అను కూలంగా మార్చుకునేందుకు ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.
కింకర్తవ్యం?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



