ముగ్గురు మంత్రులు దుబ్బాకకు వస్తే ఒక్క రూపాయి అడగలేదు

– నిన్ను ఎన్నుకున్నది ఫొటోలు దిగేందుకేనా..?
– ఎమ్మెల్యేపై బీఆర్‌ఎస్‌ నేతల ఫైర్‌
నవతెలంగాణ-దుబ్బాక
బస్టాండ్‌ ప్రారంభోత్సవానికి ముగ్గురు మంత్రులు దుబ్బాకకు వస్తే ఒక్క రూపాయి కూడా అడగలేని ఎమ్మెల్యే రఘునందన్‌ రావు తాను వచ్చాకే దుబ్బాక అభివద్ధి చెందుతుందనడం హాస్యాస్పదంగా ఉందని కౌన్సిలర్‌ ఇల్లందుల శ్రీనివాస్‌ విమర్శించారు.గెలిచి రెండున్నరేళ్లు కావస్తున్నా రూపాయి తెచ్చిన దాఖలాల్లేవని కో-ఆప్షన్‌ సభ్యుడు ఆస స్వామి ఫైర్‌ అయ్యారు. సోమవారం దుబ్బాక పురపాలిక కేంద్రంలో విలేకరులతో వారు మాట్లాడారు. ముగ్గురు మంత్రులు వస్తే దుబ్బాకకు నిధులు కావాలని కనీసం వినతి పత్రం కూడా అందించకపోవడమే కాకుండా వారితో గొడవ పెట్టుకున్నారని, నిజంగా దుబ్బాక అభివద్ధిని కాంక్షిస్తే మంత్రులను నిధులు కావాలని ఎమ్మెల్యే ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. దుబ్బాకపై ఎమ్మెల్యే రఘునందన్‌ రావుకు ఉన్న చిత్తశుద్ధి ఏంటో దీంతోనే నిరూపితమైందన్నారు. సీఎం కేసీఆర్‌ సారథ్యం,మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి ప్రత్యేక సహకారంతో తాము అభివద్ధి చేస్తుంటే వాటి వద్ద ఇక్కడి ఎమ్మెల్యే ఫోటోలు దిగుతున్నారని ఎద్దేవా చేశారు. తాను వచ్చాకే దుబ్బాక అభివద్ధి జరిగిందని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నుకున్నది ఫోటోలు దిగేందుకెేనా అని మండిపడ్డారు. తమ ప్రభుత్వాన్ని,ఎంపీ ప్రభాకర్‌ రెడ్డిని విమర్శిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు రొట్టె రాజమౌళి, సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు గుండెల్లి ఎల్లారెడ్డి, గన్నె భూమిరెడ్డి,పల్లె రామస్వామి గౌడ్‌, ఎంగారి రాజిరెడ్డి, కుమ్మరి నర్సింహులు, యాదగిరి ముదిరాజ్‌, పడాల నరేష్‌, దినేష్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love