‘పత్రికా స్వేచ్ఛ’లో మనమెక్కడీ

ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య అను సంధాన కర్తలుగా పత్రికలు నిలుస్తున్నా యనడంలో సందేహం లేదు. ప్రభుత్వ పథకాల విశ్లేషణలు, విమర్శలు, అనుకూల ప్రతికూలతలు, అవినీతిపరుల స్క్యామ్‌ బండారాల్ని బయట పెట్టడంలో పత్రికలది కీలకపాత్ర. అలాగే మానవ హక్కుల పరిరక్షణ , విజ్ఞాన, వినోద, క్రీడ, రాజకీయ సమాచార వితరణలు, ప్రజా సమస్యలకు గళం కలపడం లాంటి అంశాల్లో అద్వితీయ సేవలు అందిస్తు న్నాయి. కరోనా పలు వేవ్‌ల విజృంభన కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలు కావడంతో జీవన చక్రం సజావుగా సాగేలా చూశాయి. ప్రజలకు నిరంతరం అత్యవసర సేవలను అందించడం లాంటి సేవలను పత్రికలు బాధ్యతగా అందించాయి.
ప్రపంచవ్యాప్తంగా ఐరాస సారథ్యంలో ప్రతి ఏటా 03 మే రోజున ‘ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినం’ నిర్వహించుట ఆనవాయితీగా వస్తున్నది. 1991లో యునెస్కో నిర్వహించిన పత్రికా స్వేచ్ఛ సమావేశంలో తీసుకున్న తీర్మానం ప్రకారం ఐరాస జనరల్‌ అసెంబ్లీ 1993లో 03 మే రోజున ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినం జరుపుకోవాలని నిర్ణయించింది. 30వ దినోత్సవాన్ని ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినం-2024 నినాదంగా ‘పర్యావరణ పరిరక్షణ పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ ప్రాధాన్యం’ అనే అంశాన్ని తీసుకున్నారు. అయితే ఈ అంశం సఫలీకృతం కావాలంటే ఏం చేయాలి? పత్రికలపై రాజకీయ జోక్యం, ఆంక్షలు తగ్గాలి. పత్రికా స్వేచ్ఛకు సంబంధిం చిన మౌలిక సూత్రాలు, పత్రికా స్వేచ్ఛ పరిరక్షణ చర్యలు అమలుకావాలి. పత్రికల స్వతంత్రతను కాపాడటానికి ప్రాధాన్యత నివ్వాలి.
ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ పాలనలో పత్రికా స్వేచ్ఛ రోజురోజుకూ దిగజారుతున్న మాట వాస్తవం. పత్రికల్లో వస్తున్న వార్తలను జీర్ణించుకోలేక కొందరిని జాతి-వ్యతిరేక జర్నలిస్టులుగా ముద్రవేసి బెదిరింపులు, పత్రికల గొంతులను నొక్కడం, పత్రికా రంగంపై ఆధిపత్య ధోరణిని చెలాయించడం దారుణం. తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారనే నెపంతో న్యూస్‌క్లిక్‌ సంస్థ ఎడిటర్‌ ప్రబీర్‌ పురకాయస్తను అరెస్టు చేసి జైళ్లో పెట్టడం ఈ కోణంలో చూడాల్సిందే. ప్రభుత్వ ధోరణిని విమర్శించే పత్రికా యాజమాన్యాలు, విలేకరులు, ఫ్రీలాన్స్‌ జర్నలి స్టుల విధులకు ఆటంకంగా నిలుస్తూ, ప్రభు త్వంపై విమర్శనాత్మక వ్యాసాలను రచించే వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతుండటం పత్రికా పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగిం చడమే. ఇదే విషయాన్ని పలు నివేదికలు కూడా పేర్కొన్నాయి. పత్రికా విలేకరుల కదలి కలపై నిఘా పెట్టడం, పోలీసుల బెదిరింపు లు, పాలకుల నిఘా, పెచ్చుమీరిన హింస, అవినీతి అధికారులు, రాజకీయ నాయకుల బెదిరింపులు పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నా యని తెలిపాయి. హిందుత్వ భావనలతో పత్రికా స్వేచ్ఛకు అడ్డుతగులుతూ, కొందరు విలే కరుల ప్రాణాలు తీసేస్థాయికి హింసా ప్ర వృత్తి పెరిగిందని నివేదికలు వివరిస్తున్నాయి.
ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక-2023లో ఉన్న 180 దేశాల్లోని 52 దేశాలు మాత్రమే ప్రత్రికా స్వేచ్ఛను పూర్తిగా అను భవిస్తున్నాయి. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలో 1వ స్థానంలో నార్వే, 2వ స్థానంలో ఐర్లాండ్‌, 3వ స్థానంలో డెన్మార్క్‌, 4వ స్థానంలో స్వీడెన్‌, 5వ స్థానంలో ఫిన్‌లాండ్‌ దేశాలు సగర్వంగా నిలిచాయి. భారతదేశం 161వ స్థానంలో నిలువగా పొరుగు దేశాలు నేపాల్‌ 76వ స్థానం, పాకిస్థాన్‌ 150, బంగ్లాదేశ్‌ 163వ స్థానాల్లో ఉన్నాయి. పత్రికా స్వేచ్ఛకు విలువ ఉన్నపుడే ప్రభుత్వ పథకాల్లోనే కాకుండా ఇతర వ్యవస్థలో జరుగుతున్న లోపాలు బయట పడతాయని పాలకులు గమనించాలి. పత్రికా స్వేచ్ఛకు పట్టం కట్టిన దేశాల్లో అవినీతి అంతం కావడం, సుపరిపాలన సాధ్యపడడం, ప్రజానీకానికి మేలు జరగడం లాంటి ప్రయో జనాలు కలుగుతున్నాయి. పత్రికల గొంతును నులిమితే అన్యాయానికి పట్టాభిషేకం చేసినట్లేనన్న విషయం మరవకూడదు.
(నేడు ‘ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినం’)
– డా: బుర్ర మధుసూదన్‌ రెడ్డి, 9949700037

Spread the love