– అజ్ఞాతంలో డ్రైవర్ ఆకాష్!
నవతెలంగాణ-కంటోన్మెంట్
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదం కేసులో డ్రైవర్ అజ్ఞాతంలోకి వెళ్లి పోయారు. ప్రమాదం సమయంలో ఆమె కారు నడిపిన డ్రైవర్ ఆకాష్ ఆచూకీ తెలియడం లేదు. ప్రస్తుతం అతను అజ్ఞాతంలో ఉన్నట్టు తెలుస్తోంది. రోడ్డు ప్రమాదం జరిగిన ప్పుడు తీవ్రంగా గాయపడిన డ్రైవర్ ఆకాష్ హైదరాబాద్ మియాపూర్ మదిన గూడా స్వీకర హాస్పిటల్‌లో చికిత్స పొంది గత ఆదివారమే డిశ్చార్జ్ అయ్యాడు. అయితే అప్పటి నుంచి అతను అజ్ఞాతంలోనే ఉన్నాడు. అతను ఎక్కడ ఉన్నా డు అనేది తెలియకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. పరిసర ప్రాంతాలలో ఉంటే తనకు ఎమ్మెల్యే అభిమానుల ద్వారా ఏమైనా ప్రాణా పాయం ఉంటుందన్న కారణంతో ఆకాష్ ఎవరికీ తెలియకుండా దూరంగా ఉంటున్నట్టు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి నివేదిత పటాన్‌చెరు పోలీస్ స్టేషన్‌లో ఆకాష్‌పై కేసు పెట్టిన విషయం తెలిసిందే. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ప్రమాదానికి ముందు ఎమ్మెల్యే కారు ఓ ట్రక్కును ఢకొీట్టిన విషయం విదితమే. సీసీ ఫుటేజీల ద్వారా ఆ ట్రక్కును గుర్తించిన పోలీసులు.. డ్రైవర్‌ను పట్టుకున్నట్టు తెలిసింది.
ఆకాష్ ఎవరంటే..
లాస్య ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రెండు నూతన కార్లు కొనుగోలు చేశారు. అయితే ఆ కార్లకు ఒకే డ్రైవర్ ఉండటంతో లాస్య చిన్ననాటి స్నేహితు డు ఒకతను ఆకాష్‌ను ఎమ్మెల్యేకు పరిచయం చేశాడు. ఆకాష్ తన స్నేహితు డని, ఖాళీగా ఉంటున్నాడని, కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరే వరకు పీఏగా ఉంటాడని చెప్పాడు. దాంతో ఎమ్మెల్యే లాస్య కుటుంబీకులు ఆకాష్‌ను తొలుత పీఏగా తీసుకున్నారు. ఆ తర్వాత నల్లగొండ జిల్లాలో లాస్య నందిత కారు ప్రమాదానికి గురికావడంతో ఆ డ్రైవర్‌ను విధుల నుంచి తొలగించి ఆకాష్‌ను పీఏ కం డ్రైవర్‌గా పెట్టుకున్నారు. ఆకాష్.. కంటోన్మెంట్ బోర్డ్‌లో పని చేసే శ్రీనివాస్ అనే దప్పేదారు కుమారుడు. శ్రీనివాస్ చనిపోవడంతో కారుణ్య నియామకం ద్వారా ఆ ఉద్యోగం కోసం ఆకాష్ దాఖలు చేసుకున్నాడు. కంటో న్మెంట్ కారుణ్య ఉద్యోగాల నియామకాలు అప్పట్లో లేకపోవడంతో ఆకాష్ కానిస్టేబుల్ పరీక్ష రాసి ఎంపికయ్యాడు. త్వరలో నియామకం కావాల్సి ఉంది.