EWS reservations ను అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏది?

EWS reservations ను అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏది?1. భారత రాజ్యాంగంలో ఆర్టికల్‌ 12 ప్రకారం రాజ్య పరిధిలోకి వచ్చే సంస్థలను క్రింది వాటిలో సరైనవి గుర్తించండి.
1. సహకార సంస్థలు
2. సొంత నిధులతో నడిచే సంస్థలు
3. సొసైటీ చట్టం 1860 ద్వారా నమోదైన సంస్థలు
4. కేంద్ర రాష్ట్ర సభలు
2. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించాము?
1. కెనడా 2. ఐర్లాండ్‌
3. యుఎస్‌ఆర్‌ 4. అమెరికా
3. ఈ క్రింది ఏ కేసులో న్యాయస్థానాల కార్యనిర్వాహక విధులు కూడా రాజ్య నిర్వచన పరిధిలోకి వస్తాయని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది?
1. అజరు సహారు Vs ఖాలీద్‌ ముజీద్‌
2. సెయింట్‌ జేవియర్‌ కాలేజ్‌ Vs గుజరాత్‌
3. ఆర్‌.ఎస్‌. నాయక్‌ Vs ఎ.ఆర్‌. అంతులే
4. పైవన్నీ
4. చట్టం మూలానా సమాన రక్షణ అనే భావనను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించాము?
1. బ్రిటిషు 2. అమెరికా
3. జపాన్‌ 4. కెనడా
5. ఈక్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి.
1. ప్రాథమిక హక్కుల సలహా సంఘానికి నేతృత్వం వహించినది జె.బి. కృపలాని
2. ప్రాథమిక హక్కుల ఉపసంఘానికి నేతృత్వం వహించినది సర్ధార్‌ వల్లభారు పటేల్‌
3. ఆస్తి హక్కు ప్రస్థుతం రాజ్యాంగంలో కలదు
4. పై ఏదీకాదు
6. జతపరుచుము.
రాజ్యాంగ పరిధిలోకి వచ్చే సంస్థలు-కేసులు.
ఎ. విశ్వవిద్యాలయాలు 1. సోంప్రకాశ్‌ రేఖి Vs UOI
బి. పెట్రోలియం సంస్థలు 2. ఆర్‌.డి.చెట్టి Vs IAA
సి. ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ 3. ఉమేష్‌ సింగ్‌ Vs U.N.
పోర్టు అథారిటీ సింగ్‌
డి. ప్రభుత్వ సహాయం 4. మన్మోహన్‌ సింగ్‌ జైట్లీ
పొందే ఎయిడెడ్‌ పాఠశాల Vర.ఖు సింగ్‌
1. ఎ1, బి3, సి2, డి4 2. ఎ3, బి1, సి4, డి2
3.ఎ1, బి2, సి3, డి4 4.ఎ3, బి1, సి2, డి4
7. క్రింది వాటిలో గ్రహణ సిద్ధాంతం (డాక్ట్రిన్‌ ఆఫ్‌ ఎక్లిఫ్స్‌) అనగా ..
1. హక్కులను వదులుకోవడం
2. స్వాతంత్య్రపు అనంతర చట్టాలు ప్రాధాన్యత అనుసరించి వాటిని అమలు చేస్తారు.
3. స్వాతంత్య్రపు పూర్వచట్టాలు ప్రాధాన్యత
4. పై ఏదీకాదు
8. ఈక్రింది ఏ కేసులో గ్రహణ సిద్ధాంతాన్ని కేవలం రాజ్యాంగ పూర్వపు చట్టాలకు మాత్రమే కాకుండా అనంతర చట్టాలకు కూడా వర్తింపజేస్తామని భారత సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
1. దీప్‌చంద్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ ఉత్తరప్రదేశ్‌
2. శ్రీ అంబికా మిల్స్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ గుజరాత్‌
3. బికాజీ నారాయణ్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ మధ్యప్రదేశ్‌
4. బేహారం Vs స్టేట్‌ ఆఫ్‌ బాంబే
9. భారత రాజ్యాంగంలో క్రింది ఏ అధికరణ దేశ న్యాయవ్యవస్థకు న్యాయసమీక్ష అధికారం కల్పించింది.
1. ఆర్టికల్‌ 12 2. ఆర్టికల్‌ 13
3. ఆర్టికల్‌ 368 4. పైఏదీకాదు
10. చట్టం ముందు అందరూ సమానులే అనే భావనను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు?
1. అమెరికా 2. జపాన్‌
3. దక్షిణాఫ్రికా 4. బ్రిటన్‌
11. పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించాలని లైంగిక వేధింపుల నుండి కాపాడాలని వారికి సరైన సౌకర్యాలు కల్పించాలని సుప్రీంకోర్టు క్రింది ఏ కేసులో తీర్పునిచ్చింది?
1. కె.పి. ప్రభాకర్‌ రెడ్డి Vర ఖఉ×
2. రాజేష్‌ కుమార్‌ గుప్తా Vర ఖూ
3. విశాఖ Vర రాజస్థాన్‌
4. రణదీప్‌ సింగ్‌ Vర ఖఉ×
12. భారత రాజ్యాంగంలో క్రింది ఏ అధికరణ సామాజికంగా, విద్యా పరంగా వెనుకబాటుకు గురైన ఎస్సీ, ఎస్టీలకు విద్యలో ప్రత్యేక రిజర్వేషన్‌ కల్పించింది?
1. ఆర్టికల్‌ 15(3) 2. ఆర్టికల్‌ 15(4)
3. ఆర్టికల్‌ 15(2) 4. ఆర్టికల్‌ 15(5)
13. ఆర్థికంగా వెనుకబాటుకు గురైన అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లకు సంబంధించి క్రింది వాక్యాలలో సరికాని వాక్యాలను గుర్తించండి.
1.124వ రాజ్యాంగ సవరణ బిల్లు
2. 14 జనవరి 2019 నుండి అమల్లోకి వచ్చింది
3. 103వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 15(6)16(6) నూతన నిబంధనలు చేర్చారు
4. పై ఏదీకాదు
14. క్రింది ఏ అధికరణ ప్రకారం 14 సంవత్సరాల వయస్సులోపు బాలబాలికలు నిర్బంధ స్థలాలైన గనులు పేలుడు పదార్థాలు తయారీ వంటి చోట్ల పనిచేయించుటకు నిషేధించడమైనది.
1. ఆర్టికల్‌ 25 2. ఆర్టికల్‌ 20
3. ఆర్టికల్‌ 23 4. ఆర్టికల్‌ 24
15. ఆర్టికల్‌ 23కి సంబంధించి సరైన వాక్యాలు గుర్తించండి.
1. మనుషుల అమ్మకాలు, కొనుగోలు వంటి అక్రమ రవాణా నిషేధం
2. బానిసత్వం, వెట్టిచాకిరి, బలవంతంగా బిక్షమెత్తించడం వంటి అంశాలు
3. 1 మరియు 2 4. పై ఏదీకాదు
16. కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి.
1. బాలకార్మిక నిషేధ చట్టం 2005
2. వరకట్న నిషేధ చట్టం 1976
3. కనీస వేతనములు చట్టం 1976
4. బాలల హక్కుల చట్టం 1938
17. ఈక్రింది ఏ కేసులో సుప్రీంకోర్టు ”సాధారణ చట్టాలను మాత్రమే న్యాయసమీక్షకు గురిచేస్తామని రాజ్యాంగ సవరణలను న్యాయ సమీక్షకు గురి చేయరాదని తీర్పునిచ్చింది.
1. గోలక్‌నాథ్‌ కేసు-1967
2. సజ్జన్‌ సింగ్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ రాజస్థాన్‌ 1965
3. శంకరీ ప్రసాదు Vs UOI 1951
4. 2 మరియు 3
18. 103వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఆర్థికంగా వెనుక బాటుకు గురైన అగ్రవర్ణ పేదలకు విద్యాసంస్థలలో ఎంతశాతం రిజర్వేషన్‌ కల్పించారు?
1. 27% 2. 17% 3. 10% 4. 50%
19. ఆర్టికల్‌ 16(3) ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలను అందించడంలో నివాసం ఆధారంగా పరిమితులు విధించే అధికారం ఎవరికి కలదు?
1. రాష్ట్రపతి 2. ప్రధానమంత్రి
3. పార్లమెంటు 4. గవర్నర్లు
20. క్రింది ఏ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం యస్‌సి, యస్‌టి లకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు సీనియారిటీ ప్రకారం చేయాలనే అంశాన్ని చేర్చారు?
1. 77వ రాజ్యాంగ సవరణ చట్టం
2. 85వ రాజ్యాంగ సవరణ చట్టం
3. 90వ రాజ్యాంగ సవరణ చట్టం
4. 102వ రాజ్యాంగ సవరణ చట్టం
21. క్రింది వాక్యాలలో సరికాని అంశాలను గుర్తించండి.
1. విదేశాలు ప్రకటించే లేదా ఇచ్చే బిరుదులను భారత పౌరుడు స్వీకరించరాదు.
2. ఒక వ్యక్తి భారత పౌరుడు కాకపోయినప్పటికి భారత ప్రభుత్వం ద్వారా ఆదాయాన్నిచ్చే ఏ ఉద్యోగాన్నైన లేదా పదవినైన నిర్వర్తిస్తున్న సమయంలో విదేశాలు ఇచ్చే బిరుదులను స్వీకరించవచ్చు.
3. 1 మరియు 2 4. పై ఏదీకాదు
22. కేంద్ర ప్రభుత్వం బీసీ క్రిమిలేయర్‌ పరిమితిని ఎంత మొత్తానికి పెంచుతూ 31 అక్టోబరు 2017న ఉత్తర్వులు జారీ చేసింది?
1. 6,00,000 2. 10,00,000
3.8,00,000 4. 4,50,000
23. ఓబిసి జాబితాలోని కులాల సంఖ్యలో మార్పులు చేర్పులు చేసే అధికారం రాష్ట్రాలకు ఇవ్వడానికి రూపొందించిన 127వ రాజ్యాంగ సవరణ బిల్లును రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించారు?
1.25.08.2021 2. 18.08.2021
3.10.08.2021 4. 11.08.2021
24. బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాలు భర్తీ చేసే క్రమంలో రిజర్వేషన్లు 50% పైన కూడా ఉండవచ్చు అని క్రింది ఏ రాజ్యాంగ సవరణ చట్టం పేర్కొంటుంది?
1. 85వ రాజ్యాంగ సవరణ చట్టం
2. 83వ రాజ్యాంగ సవరణ చట్టం
3. 81వ రాజ్యాంగ సవరణ చట్టం
4. 77వ రాజ్యాంగ సవరణ చట్టం
25. క్రింది వాక్యాలలో సరికాని వాక్యాన్ని గుర్తించండి.
1. భారత రాజ్యాంగంలో అస్పృశ్యత నిర్వచనం ఆర్టికల్‌ 17లో వివరించబడింది
2. అస్పృశ్యత నిషేధ చట్టం 1955ను పౌరహక్కుల పరిరక్షణ చట్టం 1976 గా మార్చారు
3. 1 మరియు 2 4. పై ఏదీకాదు
26. ఇంటర్నెట్‌ కూడా ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు క్రింది ఏ కేసులో తీర్పునిచ్చింది.
1. అనురాధ బాసిన్‌ Vs UOI
2.PUCL Vs UOI
3. శ్రీమతి ఖుష్బు Vs తమిళనాడు
4. పై ఏదీకాదు
27. జతపరుచుము. ఆర్టికల్స్‌ -వివరణ
ఎ. 19(బి) 1. సంఘాలు, సంస్థలు స్థాపించుకొనుట
బి. 19(1జి) 2. సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకొనే స్వేచ్ఛ
సి. 19(1సి) 3. వృత్తి స్వేచ్ఛ
డి. 19(1డి) 4. సంచార స్వేచ్ఛ
1.ఎ2, బి3, సి1, డి4 2.ఎ1, బి2, సి3, డి4
3.ఎ1, బి3, సి4, డి2 4.ఎ1, బి3, సి2, డి4
28. గతించిన చట్టాలను అనుసరించి గాని లేక భవిష్యత్‌లో రాబోయే చట్టాలను ఆధారం చేసుకొని ఏ వ్యక్తిని శిక్షింప రాదు. దీనిని న్యాయపరిభాషలో ఏమంటారు?
1. సెల్ఫ్‌ ఇంక్రిమినేషన్‌ 2. ఎక్స్‌పోస్ట్‌ ఫ్యాక్టో
3. డబుల్‌ జియోపారడే 4. టెస్టిమోనియల్‌ కంపల్సన్‌
29. జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో జీవించే హక్కును రద్దు చేయకుండే పద్ధతిని ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించాము?
1. అమెరికా 2. జపాన్‌
3. ఐర్లాండ్‌ 4. కెనడా
30. మతమును ప్రోత్సహించుటకు పన్ను చెల్లింపులో స్వేచ్ఛను కల్పించే ఆర్టికల్‌ ఏది?
1. ఆర్టికల్‌ 26 2. ఆర్టికల్‌ 27
3. ఆర్టికల్‌ 25 4. ఆర్టికల్‌ 29
31. భారత రాజ్యాంగంలో ఏ ప్రకరణ ”ప్రభుత్వ నిధుల ద్వారా నిర్వహిస్తున్న విద్యాసంస్థలలో ఏ విధమైన మత బోధన జరగరాదు’ అని వివరిస్తుంది.
1. ఆర్టికల్‌ 29 2. ఆర్టికల్‌ 30
3. ఆర్టికల్‌ 27 4. ఆర్టికల్‌ 28
32. ఈక్రింది ఏ ప్రకరణను డా.బి.ఆర్‌. అంబేద్కర్‌ ”రాజ్యాంగానికి ఆత్మ/హృదయం” వంటిది అని పేర్కొన్నారు?
1.30 2. 32 3. 29 4. పై ఏదీకాదు
33. ఈక్రింది వానిలో మాండమస్‌ రిట్‌ వర్తించని వారిని గుర్తించుము.
1. ప్రయివేటు వ్యక్తి / వ్యక్తులు
2. భారత రాష్ట్రపతి / గవర్నర్స్‌
3. విదేశీయులు 4. పై అందరూ
34. భారత రాజ్యాంగంలో ”హెబియస్‌ కార్పస్‌ రిట్‌ (బందీ హాజరు) జారీ చేసే అధికారం వీరికి మాత్రమే ఉంటుంది?
1. హైకోర్టు 2. సుప్రీంకోర్టు
3. ఆధీన కోర్టు 4. 1 మరియు 2
35. ఒక వ్యక్తి ఆర్థికంగా వెనుకబడిన తరగతుల హౌదా పొందాలంటే ఈక్రింది వాటిలో ఏ అర్హత/ అర్హతలు ఉండకూడదు.
1. అతని/ఆమే వార్షిక కుటుంబ ఆదాయం 8 లక్షలు మించరాదు
2. 5 ఎకరాల కన్నా ఎక్కువ వ్యవసాయ భూమి కల్గి ఉండరాదు
3. నోటిఫైడ్‌ మున్సిపాలిటీల్లో 100 గజాల కన్నా ఎక్కువ నివాస స్థలం ఉండరాదు 4. పై ఏదీకాదు
36. జుఔూ తీవరవతీఙa్‌ఱశీఅర ను అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏది?
1. ఉత్తరప్రదేశ్‌ 2. తెలంగాణ
3. గుజరాత్‌ 4. మహారాష్ట్ర
37. 102 వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చబడిన ఆర్టికల్‌ 342 (ఎ) గురించి వాటిలో సరైనవి గుర్తించండి.
ఎ. జాతీయ వెనుకబడిన కులాల కమీషన్‌ యొక్క విధి విధానాలు అధికార బాధ్యతల గురించి తెలియజేస్తుంది.
బి. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్‌
సి. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల జాబితాల్లో మార్పులు చేయడానికి రాష్ట్రపతికి గల అధికారాలు.
డి. ఏదయినా కులాన్ని సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులుగా గుర్తించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది.
1. ఎ మరియు బి 2. సి మరియు డి
3. ఎ, బి, సి, డి 4. ఎ, బి, డి
38. సాధారణ వ్యక్తులు జాతీయ జెండాను ఎగురవేయడం కూడా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛగానే భావించాలని సుప్రీంకోర్టు క్రింది ఏ కేసులో తీర్పునిచ్చింది.
1. నవీన్‌ జిందాల్‌ Vs UOI
2. బెనెట్‌ కొల్మన్‌ Vs UOI
3. బిందు ఇమ్మాన్యుల్‌ Vర కేరళ 4. పై ఏదీకాదు
39. రాజద్రోహం ×124(A) గురించి కింది వాటిలో సరైనవి గుర్తించండి.
1. థామస్‌ మెకాలే నేతృత్వంలో 1870 సంవత్సరంలో ×ూజ లో చేర్చారు.
2. రాజద్రోహ చట్టం ప్రకారం 1897లో మొట్టమొదటి సారిగా బాలగంగాధర తిలక్‌ను అరెస్ట్‌ చేశారు
3. కేదార్‌నాథ్‌ సింగ్‌ Vs state of Bihar  కేసులో రాజ్యాంగ బద్దమే అని తీర్పు 4. పైవన్నీ
40. కింది ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుండి తొలగించారు.
1. 44వ రాజ్యాంగ సవరణ చట్టం
2. 42వ రాజ్యాంగ సవరణ చట్టం
3. 27వ రాజ్యాంగ సవరణ చట్టం
4. 91వ రాజ్యాంగ సవరణ చట్టం
41. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కారుణ్య మరణాన్ని అనుమతిం చవచ్చని సుప్రీంకోర్టు క్రింది ఏ కేసుల్లో తీర్పునిచ్చింది?
1. అరుణాషాన్‌బాగ్‌ కేసు
2. కామన్‌ కాస్‌ Vs UOI
3. 1 మరియు 2 4. ఏదీకాదు
42. ప్రాథమిక హక్కులను రద్దు చేసే అధికారం ఎవరికి ఉంటుంది?
1. సుప్రీంకోర్టు 2. పార్లమెంటు
3. రాష్ట్రపతి 4. ప్రధానమంత్రి
43. ఆర్టికల్‌ 12 ప్రకారం రాజ్య నిర్వచనంలోని అంశాలను క్రింది వాటిలో ఏవి?
ఎ. స్థానిక సంస్థలు బి. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు
సి. రాష్ట్ర శాసనసభలు డి. సహకార సంఘాలు
1. ఎ, బి 2. ఎ, సి, డి
3. బి, డి 4. ఎ, బి, సి
44. భారత సుప్రీంకోర్టు ఏ కేసులో రాజ్యాంగ మౌలిక స్వరూపాలని భంగం కలిగించేటట్లుగా ప్రాథమిక హక్కులకు రాజ్యాంగ సవరణ జరిగితే అదిచెల్లదు అని తీర్పునిచ్చింది?
1. గోలక్‌ నాథ్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌
2. శంకరీప్రసాద్‌ Vs UOI
3. కేశవానంద భారతి కేసు 4. ఏదీకాదు
45. భారత రాజ్యాంగంలో ఆర్టికల్‌ 26కు సంబంధించి క్రింది వాక్యాలలో సరైనవి గుర్తించండి.
1. మత వ్యవహారాల నిర్వహణలో స్వేచ్ఛను కల్పిస్తుంది.
2. మత విషయాలలో స్వీయ వ్యవహారాలను నిర్వహించుటకు హక్కులను కల్పిస్తుంది.
3. స్థిర చరాస్తుల సంపాదన మరియు ఆధీన హక్కులు
4. పైవన్నీ
46. క్రింది వాక్యాలలో సరైనవి గుర్తించండి.
1. రాజ్యంచే పోషించబడే విద్యా సంస్థలలో మత బోధన పూర్తిగా నిషేధం
2. రాజ్యాంచే గుర్తించబడ్డ విద్యాసంస్థలలో మత బోధనకు అనుమతి ఉంటుంది.
3. ఎ మరియు బి 4. ఏదీకాదు
47. భారతదేశంలో నివసిస్తున్న పౌరులలో ఏవర్గం వారైన తమ విశిష్ట భాష, లిపి, సంస్కృతిని కాపాడుకునే హక్కు ఉంది అని ఏ ఆర్టికల్‌ పేర్కొంటుంది?
1. ఆర్టికల్‌ 25 2. ఆర్టికల్‌ 29
3. ఆర్టికల్‌ 27 4. ఆర్టికల్‌ 30
48. ఈక్రింది వాటిలో ఏ రిట్‌ ను అక్రమ నిర్బంధంలో ఉన్న వ్యక్తిని విడుదల చేయడానికి తగిన న్యాయ సంస్థ/సంఘం జారీ చేస్తుంది?
1. హెబియస్‌ కార్పస్‌ 2. ప్రొహిబిషన్‌
3. మాండమస్‌ 4. కోవారంటో

సమాధానాలు
1.4 2.4 3.3 4.2 5.3
6.4 7.3 8.2 9.2 10.4
11.3 12.2 13.4 14.4 15.3
16.1 17.4 18.3 19.3 20.2
21.2 22.3 23.2 24.3 25.1
26.1 27.1 28.2 29.2 30.2
31.4 32.2 33.4 34.4 35.4
36.3 37.2 38.1 39.4 40.1
41.3 42.3 43.4 44.3 45.4
46.3 47.2 48.1
డాక్టర్‌ అలీ సార్‌, 9494228002
భారత రాజ్యాంగ నిపుణులు

Spread the love