సింధూ నాగరికత

మీ– పోటీ పరీక్షల ప్రత్యేకం  జనరల్‌ స్డడీస్‌
సింధూనది భారత ఉపఖండంలో ప్రసిద్ధమైన హిమనది. ఇది టిబెట్‌ దేశంలో పుట్టి కాశ్మీర్‌, పంజాబ్‌, సింధు రాష్ట్రాలలో ప్రవహించి పారిస్తాన్‌లోని కరాచీ సమీపంలో అరేబియా సముద్రంలో కలుస్తుంది. సింధూనది ఉపనది అయిన సట్లెజ్‌ (పంజాబ్‌) నదిపై భారతదేశం బాక్రానంగల్‌ ఆనకట్ట కట్టింది.
సింధూనది ఉపనది అయిన జీలం (అజాద్‌ కాశ్మీర్‌) నదిపై పాకిస్తాన్‌ మంగ్లా డ్యామ్‌ను నిర్మించింది. సింధూనది పొడవు 2880 కిలో మీటర్లు. సింధూనది ప్రవాహిత ప్రాంతంలో హరప్పా, మొహంజొదారో నాగరికత వర్ధిల్లింది. సింధూ నదీ లోయలో సుమారు 5000 ఏండ్ల మహౌజ్వలమైన సింధు నాగరికత వెలసి వర్థిల్లింది.
ప్రాచీన కాలంలో భారతదేశ ప్రజలు సింధునదిగా పిలిచే వారు. సింధూ అనేది సంస్కృత పదం. సింధూ అంటే అతిపెద్ద జల ప్రవాహం, సముద్రం అని అర్థం. రుగ్వేదంలో చాలా నదులు ప్రస్తావించ బడ్డాయి. అందులో సింధూ నది కూడా ఒకటి. రుగ్వేదంలో సింధూనది ప్రస్తావన దాదాపు 176 సార్లు వచ్చింది. రుగ్వేద శ్లోకాలలో సహలజంగా అన్ని నదులను స్త్రీ రూపాలుగా వర్ణిస్తే ఒక సింధూనదిని మాత్రం పురుష రూపంగా వర్ణించబడి ఉంది. రుగ్వేదం ప్రకారం సింధునది అంటే యోధుడు. ప్రపంచంలోని అన్ని నదుల కంటే గొప్పది అని అర్థం.
ప్రపంచంలో కెల్లా 21వ అతి పెద్ద నది సింధూనది. 1950 దశకంలో సింధూ నాగరికత మూలాలపై అనేక సిద్ధాంతాలు వెలు వడ్డాయి. హరప్పా వాసులు స్థానికులే అని ఒక సిద్ధాంతం, వారు ఇరాన్‌ (ఏలమ్‌) మెసొపొటామియా నుంచి వలస వచ్చారని ఒక సిద్ధాంతం. పై రెండు సిద్ధాంతాల అభిప్రాయాల నుంచి ప్రేరేపిత సమ్మేళనం అనే సిద్ధాంతం వచ్చింది. కోట్‌ డిజియన్‌, అమ్రీ, సోధి (కాలిబంగన్‌) సంస్కృతులు హరప్పా పూర్వ దశకు చెందిన సంస్కృతులు.
ప్రస్తుతం భారతదేశం, పాకిస్తాన్‌లోగల గగ్గర్‌ హాక్రా సింధు నదుల పరీవాహక ప్రాంతంలో విలసిల్లిన అతి ప్రాచీన నాగరికత సింధూ నాగరికత. అప్ఘనిస్తాన్‌, తుర్కమేనిస్తాన్‌, ఇరాన్‌ దేశాలలో కూడా ఈ నాగరికతకు సంబంధించిన శిథిలాలను వెలికి తీయడం జరిగింది. ఈ నాగరికతకు చెందిన హరప్పా నగరం మొదట వెలికి తీయడం వల్ల దీనిని సింధూలోయ హరప్పా నాగరికత అని పిలవబడడం జరిగింది.
సింధూ నాగరికతకు సమకాలీన నాగరి కతలు మెసపొటోమియా, ప్రాచీన ఈజిప్టు నాగరికతలు, సింధూ నాగరికతకు సింధూ ఘగ్గర్‌ – హక్రా నాగరికత
సింధూ సరస్వతి నాగరికత అని కూడా అభివర్ణిస్తారు. అత్యంత అభివృద్ధి చెందిన దశను హరప్పా నాగరికత అంటారు. సింధు నాగరికత ప్రజలు పట్ట ణాలను అభివృద్ధి చేయడంలో సిద్దహస్తులు వీరు. పొడవు, ద్రవ్యరాశి, కాలాలను కచ్చి తంగా కొలిచినట్లు ఆధారా లున్నాయి. శిల్పాలు, ముద్రలు, మానవ శరీర శాస్త్రాన్ని వివరంగా విపులీకరించే టెర్రా కోట బొమ్మలు, ఇత్తడి వస్తు వులు తవ్వకాలలో లభ్యమయ్యాయి. సింధు ప్రజలు గోధుమలు, బార్లీలు వాడినట్లు రుజువులు కలవు. సింధూ ప్రజల గుర్తులు 400 నుంచి 600 వరకు వివిధ ముద్రల లోనూ, పింగాణీ పాత్రలపై గుర్తించారు (ముద్రలు 2000కుపైగా)
1872-75 మధ్య కాలంలో అలెగ్జాండర్‌ కన్నింగ్‌ హారు మొదటిసారిగా హరప్పాకు సంబం ధించిన ముద్రలను ప్రచురించాడు. 1921-22 సంవత్సరంలో జాన్‌ మార్షల్‌, దయారామ్‌ సాహ్నే మథో సరూప్‌వత్స్‌ హరప్పా శిథిలాలను కనుగొన్నారు. హరప్పా నరగంలో సుమారు 23,500 మంది నివశించేవారని ఆధారాలను బట్టి తెలుస్తుంది. హరప్పా – మొహంజోదారో నిర్మాణాలన్నీ ఇటుకలతో నిర్మించారు. ధోల వీరాలో మాత్రం నిర్మాణాలన్నీ రాతితో నిర్మించారు. ధోలవీరాలో 2014లో గుర్తించిన 73.4 కిలో మీటర్ల పొడవు 29.3 మీటర్ల వెడల్పు, 10 మీటర్ల లోతు కల్గిన చతుర్జజాకారపు దిగుడు బావి మొహంజోదారోలోని స్నాన ఘట్టం కంటే 3 రెట్లు పెద్దది.
హరప్పా ప్రజలు మాట్లాడిన భాష గురించి ఎవరికి తెలియదు. వీరి లిపిని ఇంత వరకు ఎవరూ చదవలేదు. హరప్పా ప్రజలు రాత కుడి నుంచి ఎడమకు రాసేవారు. దొలవీరా పట్టణంలో సింధు లిపితో దొరికిన సైన్‌ బోర్డ్‌లో పెద్ద గుర్తులను పోలిన అక్షరాలు కలవు. సింధూ లిపి చిహ్నాలను 1853లో అలెంగ్జాండర్‌ కన్నింగ్‌ హామ్‌ అనే పురాతత్వ శాస్త్రవేత్త మొదటిసారిగా ప్రచురించాడు.
మొహంజోదారోలో 11.88 X 7.01 మీ పొడవు వెడల్పు 2.43 మీటర్లు. గరిష్ఠ లోతులో అద్భుత స్నాన ఘట్టం కనుగొనడం జరిగింది. (11.440 చదరపు అడుగులు). కాలీ బంగా అంటే నల్లని గాజులు అని అర్థం. మొహంజోదారో అంటే మృతుల దిబ్బ అని అర్ధం. సింధూ నాగరికత తామ్ర శిలాయుగంనకు చెందినది. సింధు నాగరికత క్రీ||పూ 2800- 2200 కాలం. దీని అవశేషాలు 250కిపైగా ప్రదేశాలులో గుర్తించారు. సింధూ నాగరికతలో వెలుగు చూసిన మొత్తం పట్టణాలు ఆరు. 1.హరప్పా, 2. మొహంజోదారో, 3.చాన్హుదారో, 4.లోధల్‌, 5.కలిబంగన్‌, 6.ఒన్వారీ.
మొహంజోదారో పాకిస్తాన్‌లోని సింధు రాష్ట్రంలో లార్ఖానా జిల్లాలో వుంది. హరప్పా పాకిస్తాన్‌లోని పంజాబ్‌ రాష్ట్రాంలో మాంటిగోమరి జిల్లాలో వుంది. సన్హ-దారో సింధూ నాగరికతకు చెందిన ఒక కార్నెలియన్‌ పూసల తయారీ కేంద్రం. సింధూ ప్రజలకు ఇనుము గురించి తెలియదు. సింధూ ప్రజలు వర్తకం కోసం ఎక్కా అనే ఎడ్ల ఒండ్లను వినియోగిం చారు.
సింధూ ప్రజలు వర్తకం వస్తుమార్పిడి విధానంలో వుండేది సింధూ ప్రజల పంటలు – గోధుమలు, బార్లీలు, ఖర్జూరాలు, బఠానీలు, నువ్వులు ఆవాలు. సన్హదారోలో ప్రజలు లిప్‌స్టిక్స్‌ వాడిన ఆధారాలు కూడా వున్నాయి. హరప్పాలో నర్తకి కాంస్య విగ్రహం ద్వారా ఆనాడు నాట్యం మొదలైన కళలు వున్నట్లుగా తెలుస్తుంది. భారత దేశానికి వలస వచ్చిన ఆర్యులు దండయాత్రల వలన హరప్పా పట్టణాలు ద్వసం అయివుం డొచ్చని చరిత్రకారులు అభిప్రాయ పడతారు. సింధూ నది పరివాహక మార్గల్లో మార్పులు, ఎడారులు వ్యాప్తి చెందడం కూడా సింధూ నాగరికత నశించడానికి ఒక కారణం కావచ్చు.
– కె. నాగార్జున
జనరల్‌ స్డడీస్‌
9490352545

Spread the love