జుక్కల్ అసెంబ్లీ బాద్‍షా ఎవరు

– బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి, అభ్యర్థుల ముమ్మర ప్రచారాలు మూడు పార్టీల్లోకి ప్రజల చేరికలు

– బాద్షా ఎవరో చెప్పలేని అంచనాలు
నవతెలంగాణ-మద్నూర్
కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ ఎస్సీ రిజల్టు కాన్స్టెన్సీ లో బాద్షా ఎవరో అభ్యర్థులకు అంచనాలు తెలియని పరిస్థితి. ఎందుకంటే జుక్కల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బిజెపి పార్టీ ఈ మూడు పార్టీల అభ్యర్థులు ప్రచారోల్లోకి ఎక్కడికి వెళ్లినా జనాలు మూడు పార్టీల్లో చేరికలు ముమ్మరంగా కనిపిస్తున్నాయి. ప్రజల చేరికలతో బాద్షా ఎవరనేది అంచనాలు తెలియని పరిస్థితి జుక్కల్ నియోజకవర్గంలో బి ఆర్ఎస్ పార్టీ అభ్యర్థి హనుమంతు షిండే ముచ్చటగా మూడుసార్లు హ్యాట్రిక్ సాధిస్తూ నాలుగో సారి గెలుపు కోసం ముమ్మరంగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తోట లక్ష్మీకాంతరావు కొత్త అభ్యర్థిగా పోటీ చేస్తూ ముమ్మర ప్రచారాల్లోతో ప్రజల్లోకి వెళ్తున్నారు. అదేవిధంగా బిజెపి పార్టీ అభ్యర్థి జుక్కల్ మాజీ ఎమ్మెల్యే కుమారి అరుణాతారా గెలుపు కోసం ముమ్మరంగా ప్రచారాలు చేపడుతున్నారు. ఈసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మూడు పార్టీల అభ్యర్థులు ఎక్కడికి వెళ్లినా అక్కడ ఆ నాయకులతో చేరికలు భారీగా జరుగుతున్నాయి నియోజకవర్గ ప్రజలు ఈ గట్టుకు వస్తావా నాగన్న ఆ గట్టుకెళ్తావా అనే రీతిలో ఏ పార్టీ అభ్యర్థి ప్రచారానికి వస్తే ఆ పార్టీ అభ్యర్థి ఆధ్వర్యంలో చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ గట్టుకు వస్తావా ఆ గట్టుకు వెళ్తావా అనే రీతిలో కొనసాగుతున్న చేరికలను బట్టి చూస్తుంటే జుక్కల్ బాద్షా ఎవరనే దానిపై గెలుపు అంచనాలు తారుమారుగానే కనిపిస్తున్నాయి. నేనంటే నేనే గెలుస్తానంటూ ఆయా పార్టీల నాయకులు కార్యకర్తలు ఉత్సాహంతో ప్రచారాలు జోరుగా కొనసాగిస్తున్నారు. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి హనుమంతు షిండే కెసిఆర్ ఆయంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ముమ్మరంగా ప్రచారాలు చేపడుతూ మరోసారి కేసీఆర్ ప్రభుత్వానికి అధికారంలోకి తీసుకురావాలనీ నియోజకవర్గ ప్రజలను కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోట లక్ష్మీకాంతరావు ఆ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో ఆరు గ్యారెంటీ పథకాల గురించి ముమ్మరంగా ప్రచారాలు చేపడుతున్నారు. ఇక జుక్కల్ మాజీ ఎమ్మెల్యేగా తన హాయంలో చేపట్టిన అభివృద్ధిని ఇంతవరకు 20 ఏళ్లు గడిచిన ఎలాంటి అభివృద్ధి జరగలేదని దానిపై బీజేపీ అభ్యర్థి కుమారి అరుణాతార ముమ్మర ప్రచారాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ ముగ్గురిలో గెలుపు ఎవరిదో జుక్కల్ బాద్షా ఎవరో లెక్క కట్టలేని అంచనాలు కొనసాగుతున్నాయి చివరికి ఈనెల 30న జరిగే ఎన్నికల పోలింగ్లో జుక్కల్ నియోజకవర్గం ప్రజల నాడి ఎవరి వైపు వెళ్తుందో డిసెంబర్ 3 న జరిగే కౌంటింగ్ వరకు వేచి చూడవలసిందే.
Spread the love