ప్రజా సమస్యలపై ప్రశ్నించేది ఎవరు?

నవతెలంగాణ- గోవిందరావుపేట

నేటి మండల సర్వసభ్య సమావేశంలో ప్రజా సమస్యలపై ప్రశ్నించేది ఎవరు? అన్న ప్రశ్న ఇప్పుడు మండల వ్యాప్తంగా చర్చనీయాంశ అయింది. ప్రధానంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలలో వర్ష బావ పరిస్థితులు నిండని లక్నవరం చెరువు, కోటి రూపాయలు మరమతులకు వెచ్చించిన ఇంకా మొదలుకాని పనులు అయోమయంలో మండల రైతాంగం రైతాంగ సమస్యలపై మాట్లాడేది ఎవరు. పలు గ్రామాలలో చిన్న వర్షానికి బురదమయం అవుతున్న వీధులు వీధుల నిండా పెరిగిన పిచ్చి మొక్కలు వాటితో ప్రజలుతున్న వ్యాధులు తదితర అంశాలపై గళం విప్పే నాయకుడు ఎవరు? ఎప్పుడు సమావేశాలు జరిగిన దాదాపు సగానికి పైగా శాఖల అధికారులు హాజరు కారు అలాంటి హాజరుకాని అధికారులపై ఎలాంటి చర్యలు ఉంటాయి అని అడిగే నాధుడు ఎవరు. అధికారులే కాదు ప్రశ్నించాల్సిన ప్రజాప్రతినిధులు కూడా ఒక్కోసారి సగం మంది కూడా హాజరు కారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా సమస్యలను పట్టించుకునేది ఎవరు దీనికోసం శనివారం జరిగే మండల సర్వసభ్య సమావేశంలో వేచి చూడాల్సిందే మరి! ఇంకా అందని పెన్షన్లు అర్హులై ఉండి కూడా ఆఫీసు చుట్టూ తిరుగుతున్న పేద ప్రజానీకం  సమస్యలను పట్టించుకునేది ఎవరు? పలు గ్రామాల్లో సరిగా అందని మిషన్ భగీరథ నీరు సీజన్ స్టార్ట్ అయింది వర్షాకాలం సీజనల్ వ్యాధుల పట్ల ముందస్తు జాగ్రత్తల విషయం హెల్త్ క్యాంపు ల నిర్వహణ తదితర అంశాలపై ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు సమస్యలను అధికారుల సమక్షంలో అడిగి పరిష్కారం చూపిస్తారన్న ఆశతో మండల ప్రజానీకం ఎదురుచూస్తున్నారు.  నెలలు గడుస్తున్న ఖాతాల్లో పడని ఉపాధి హామీ పథకం కూలి పైసలు గొల్ల కురుమలకు ఇంకా అందని గొర్ల పంపిణీ, నాణ్యత లేక గోతుల మయమవుతున్న సిసి రహదారులు పలు సమస్యలపై ప్రజాప్రతినిధులు ప్రశ్నించాలని ప్రజలు కోరుకుంటున్నారు.
Spread the love