బీసీ కులాల్లో నిరుద్యోగులకు లక్ష రూపాయలు ఇవ్వాలి: బి సంజీవ డివైఎఫ్ఐ

నవతెలంగాణ-గోవిందరావుపేట
బీసీ కులాల్లోని నిరుద్యోగులైనటువంటి యువతి యువకులకు ప్రభుత్వం లక్ష రూపాయలు నిరుద్యోగ బంధు ఇవ్వాలని డివైఎఫ్ఐ ములుగు జిల్లా అధ్యక్షులు బొచ్చు సంజీవ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని తాసిల్దారు కార్యాలయంలో బీసీ నిరుద్యోగ యువత కు లక్ష రూపాయలు ఇవ్వాలన్న డిమాండ్ మేరకు  తహసిల్దార్ ఆఫీస్ లో సీనియర్ అసిస్టెంట్ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం సంజీవ మాట్లాడుతూ బీసీల్లో 15 కులాల్లో ఉంటున్న యువత నిరుద్యోగం తోటి ప్రైవేటు కంపెనీలలో  షాపుల్లో చాలీచాలని వేతనాలతో ఇల్లు గడవడం కష్టంగా బ్రతుకు కొనసాగిస్తున్నారని అన్నారు.  కడు పేదరికం మెరుగైన విద్యా వైద్యం అందుకునే పరిస్థితిలో లేదని వేతనం బెత్తడు పని భారేడు అనే విధంగా ప్రవేటు సంస్థల కంపెనీల్లో పని భారం ఉందని యువతకి ప్రభుత్వం చేయూతగా ఉండే విధంగా లక్ష రూపాయలు ఇచ్చి వారి స్వయం ఉపాధికి సహకరించాలని  ప్రభుత్వాన్ని  డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ మండల నాయకులు పిట్టల అరుణ్ మాదాసు శ్రావణ్ సిరిబలి జీవన్ గణేష్ అరవింద్ కణాల సందీప్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love