అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

– రత్నం రాజేందర్ సిఐటియు జిల్లా కార్యదర్శి
నవతెలంగాణ-గోవిందరావుపేట
అంగన్వాడి జీపు జాత గోడ పత్రిక ఆవిష్కరణ అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ అన్నారు. శనివారం మండలంలోని పసర సిఐటియు కార్యాలయంలో అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ తో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాజేందర్ హాజరై మాట్లాడారు. ముందుగా అంగన్వాడీ ల సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 16 ఆదిలాబాద్ లో ప్రారంభించే జీపు యాత్ర పోస్టర్ ను ఆవిష్కరించి మాట్లాడారు. ఐసిడిఎస్ రక్షణ కోసం, అంగన్వాడీ ఉద్యోగులకు 45 వ లేబర్ కాన్ఫరెన్స్ సిఫార్సుల ప్రకారం కనీస వేతనము, పెన్షన్ ,ఈ ఎస్ ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాటిటీ అమలు పరచాలని, ఇతర పెండింగ్ సమస్యలను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా పోరాటాలు ఉధృతం చేయాలని, ఆల్ ఇండియా అంగన్వాడీ యూనియన్ పిలుపునిచ్చిందని ఈ పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో జీపు యాత్ర చేస్తున్నామని ఈ యాత్ర ములుగు జిల్లా లో 26,27 తేదీ ల్లో ఉంటుంది అన్నారు. ఈ జాత జయప్రదం కోసం పెద్ద ఎత్తున అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు తరలి రావాలని, తమ సమస్యలను జీపు జాత దృష్టికి తేవాలని జూలై 10 న పెద్ద ఎత్తున కోరికల దినం పాటించి 10 కిలోమీటర్ల పాదయాత్ర నల్ల చీరలతో బ్లాక్ డే నిర్వహించి సమస్యల తో కూడిన వినత్పత్రాన్ని కలెక్టర్ గారికి అందజేస్తూ కలెక్టరేట్లను ముట్టడించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి జిల్లా అధ్యక్ష, కార్యదర్శి లు కె సరోజన, కె సమ్మక్క, ప్రేమకుమారి,వెంకటరమణ, రత్న కుమారి,కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.

Spread the love