రైతుబిడ్డను..నన్ను గెలిపించండి

– బీఆర్‌ఎస్‌ ఖమ్మం పార్లమెంట్‌ అభ్యర్థి నామా నాగేశ్వరరావు
నవతెలంగాణ – బోనకల్‌
రైతు బిడ్డగా, ఖమ్మం బిడ్డగా ప్రజల పక్షాన నికరంగా నిలబడి పోరాటం చేస్తున్న నన్ను ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఖమ్మం పార్లమెంట్‌ బిఆర్‌ఎస్‌ అభ్యర్థి గా పోటీ చేస్తున్న నామా నాగేశ్వరరావు కోరారు. మండల కేంద్రంలో బుధవారం రాత్రి రోడ్‌ షో నిర్వహించారు. ఈ రోడ్‌ షో లో నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ పది సంవత్సరాలపాటు పార్లమెంట్‌ అభ్యర్థిగా ఉండి రాష్ట్రానికి రావలసిన అన్ని నిధులను కేంద్రంతో పోరాటం చేసి తీసుకువచ్చానన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎంపీ కాకముందు ఒక్క జాతీయ రహదారి కూడా లేదన్నారు. తాను ఎంపీగా ఎన్నికైన తర్వాత జిల్లాకు పదివేల కోట్ల జాతీయ రహదారులు తీసుకొచ్చానన్నారు. కాంగ్రెస్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అమలుకు నోచుకోని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్‌ మోసపూరిత హామీలను నమ్మి ప్రజలు కాంగ్రెస్‌ అభ్యర్థులకు ఓట్లు వేయొద్దని కోరారు. తనను గెలిపిస్తే ప్రజల గొంతుకగా మారి ప్రజా సమస్యలపై పార్లమెంటులో పోరాడుతానన్నారు. తనకు అత్యధిక ఓట్లు తీసుకొచ్చిన గ్రామాలలో గల నాయకులకు స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఆ నాయకుల గెలుపుకు నాదే పూర్తి బాధ్యత తీసుకుంటానన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కెసిఆర్‌ మాత్రమే తీసుకొచ్చారని, పార్లమెంట్‌ ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థులను మాత్రమే గెలిపించాలని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కోరారు. కెసిఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాగునీటి సమస్య లేదన్నారు. కానీ ప్రస్తుతం తాము ఏ ఊరు వెళ్లిన తాగునీటి సమస్య స్వాగతం పలుకుతుందన్నారు. డిసిసిబి చైర్మన్‌ గా ఉన్న బీసీ నాయకులు కూరాకుల నాగభూషణాన్ని అప్రజాస్వామికంగా తొలగించి బీసీలకు కాంగ్రెస్‌ ద్రోహం చేసిందన్నారు. మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదన్నారు.ఈ ప్రచార కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్‌ రాజు రాష్ట్ర వితనాభివద్ధి సంస్థ మాజీ కార్పొరేషన్‌ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు ఆ పార్టీ మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావు మండల ప్రధాన కార్యదర్శి మోదుగుల నాగేశ్వరరావు నాగేశ్వరరావు బి ఆర్‌ ఎస్‌ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు బంధం నాగేశ్వరరావు మాజీ జెడ్పిటిసి బానోతు కొండ, పోటు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Spread the love