తమలపాకులో చర్మానికి మేలు చేసే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది చర్మంలోని వేడిని లాగేస్తుంది. మీరు దీనిని ముఖంపై అప్లై చేసుకుంటే అనేక చర్మ సమస్యలు తొలగిపోతాయి.
మొటిమలు
ముఖం మీద మురికి, జిగట, హార్మోన్లలో తేడాల కారణంగా మొటిమల సమస్య వస్తుంది. అలాగే మారుతున్న జీవనశైలి వల్ల కూడా ఇవి రావచ్చు. ఈ సమస్యను తగ్గించుకునేందుకు చాలామంది రకరకాల చిట్కాలు ప్రయత్నిస్తుంటారు. తమలపాకులో మొటిమల సమస్యను నివారించే అద్భుత ఔషధ గుణాలున్నాయని చాలామందికి తెలియదు. ఇవి పోవాలంటే.. ముందుగా తమలపాకులను నీటితో శుభ్రం చేయండి. తరువాత మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఈ పేస్ట్‌లో నీటిని పూర్తిగా వడకట్టి కాటన్ ప్యాడ్‌తో ముఖంపై అప్లై చేయండి. దీన్ని రాసుకోవడం వల్ల మొటిమల చికాకు తగ్గి చర్మం శుభ్రంగా కనిపిస్తుంది.
నల్లటి మచ్చలు
ముఖం మీద మొటిమలు పోయిన తర్వాత నల్లటి మచ్చలు ఏర్పడుతుంటాయి. ఇవి మీ ముఖం అందాన్ని తగ్గిస్తాయి. అంటే వివిధ రకాల క్రీములు ప్రయత్నిస్తుంటారు. ఇంత కష్టపడే బదులు తేనెతో కలిపి తమలపాకు పేస్ట్ రాసుకోండి. ఈ సమస్య ఇట్టే తగ్గిపోతుంది. మార్కెట్లో దొరికే ఖరీదైన క్రీములను పూసుకోవాల్సిన అవసరం లేదు.
గ్లోయింగ్ స్కిన్
తమలపాకుతో ముఖాన్ని ప్రకాశవంతంగా మార్చగలిగే ఎన్నో గుణాలున్నాయి. ఇది మీ ముఖం మెరుపును రెట్టింపు చేస్తుంది. ముందుగా తమలపాకును మెత్తని పేస్ట్ చేయాలి. తరువాత ఈ మిశ్రమంలో ఉన్న నీటిని ఫిల్టర్ చేసి శనగపిండిలో కలపండి. కొద్దిగా పసుపు కూడా కలిపి పేస్ట్ లా చేసి ఫేస్ ప్యాక్ లాగా ముఖానికి అప్లై చేసుకోండి. 10-15 నిమిషాలు అలాగే ఉంచుకుని నీటితో శుభ్రపరచుకుంటే ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది. ఇలాగే తరచూ చేస్తే సమస్య పూర్తిగా తొలగిపోతుంది.
తమలపాకుతో….
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


