యాలకులతో…

సుగంధ ద్రవ్యాల్లో యాలకులు కూడా ఒకటి. వీటిని వంటల్లో మంచి సువాసన కోసం మాత్రమే కాదు… ఆరోగ్యపరంగానూ ఉపయోగిస్తుంటారు. ఈ యాలకులు ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేస్తాయో కొన్నింటిని చూద్దాం…
పిల్లలలో జలుబుకి యాలకులు మంచి ఔషధంగా చెప్పవచ్చు. నాలుగు లేదా ఐదు యాలకులు నిప్పులపై వేసి ఆ పొగను పీల్చినట్లయితే ముక్కు కారటం తగ్గుతుంది.
కడుపు ఉబ్బరంతో బాధపడుతున్నపుడు యాలకులు పొడి చేసి, అర టీస్పూన్‌ పౌడర్‌ను తీసుకొని చిన్న గ్లాసులో సగం నీళ్లు తీసుకుని ఉడికించి, చల్లార్చి తాగితే కడుపు ఉబ్బరం తగ్గిపోతుంది.
డిప్రెషన్‌ ఉన్నవారు ‘యాలకుల టీ’ తాగితే సాధారణ స్థితికి వస్తారు. తక్కువ టీ పౌడర్‌, ఎక్కువ యాలకులు టీని కలిపి తీసుకుంటే మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. అయితే ఏలకులు ఎక్కువగా నమలడం లేదంటే నోటిలో చాలా సమయం అలాగే ఉంచడం మంచిది కాదు.

Spread the love