అధికారుల అండతో- ఇసుక మాఫియా దందా

నవతెలంగాణ – రేవల్లి: రేవల్లి మండల కేంద్రంలో ఇసుక మాఫియా ఆకడాలు ఎక్కువైపోయినాయి. చీకటి పడితే చాలు అర్ధరాత్రి సమయంలో ఇసుకను అక్రమంగా రవాణా రోజు రోజుకు అధికమవుతుందని మండల ప్రజలు వాపోతున్నారు. అక్రమ రవాణా జరుగుతున్న సమయంలో అధికారులకు సమాచారం ఇచ్చిన ఎలాంటి స్పందన లేదంటూ మండల ప్రజలు అధికారుల తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.
చీకటి కోణంలో దాగివున్న అధికారులు
రాత్రి వేళలో ఇసుక మాఫియాకు సహకరిస్తూ అధికారులు తమ చేతికి మట్టి అంటకుండా రాత్రి వేళలో  మేనేజ్ చేస్తున్నారని, ఈ అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నట్లు ఆరోపణాలు వినిపిస్తున్నాయి. ముంపు బాధితులకు గురైన గ్రామాల పేర్లు  చెప్పుకొని,  రాత్రి వేళలో ఇసుకను దొంగతనంగా అమ్ముకోవడానికి ఈ అధికారుల  దగ్గర మాట్లాడుకుని తరలిస్తున్నారని గ్రామస్తులు గుసగుసలాడుతున్నారు. ఈ మాఫియా వల్ల అమాయకమైన ముంపు బాధితులైన గ్రామాలు అక్రమంగా గురవుతున్నాయి అని గ్రామస్తులు మండిపడుతున్నారు.
మట్టి నుంచి ఇసుక చేస్తున్న మాఫియా గ్యాంగ్
ఎక్కడపడితే అక్కడ మట్టి పర్మిషన్ లేకుండా మట్టిని తోవి కుప్పలుగా పోసి, తడిగా ఉన్న మట్టిని బాగా ఎండబెట్టి వీటి నుంచి మోటార్ ద్వారా ఫిల్టర్ చేసి, వాటి నుంచి ఇసుకను వేరు చేస్తున్నారని. ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడమే కాకుండా, అమాయక ప్రజలను మోసగిస్తూ నాణ్యతలేని ఇసుక వ్యాపారం చేస్తున్నారు.
ప్రభుత్వం రైతులకు అందిస్తున్న 24 గంటల  కరెంటు ఈ వ్యాపారాలకు గొప్ప వరంగా మారిన వైనం. పంటలు పండించుకోవడానికి రైతులకు ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత విద్యుత్తు కొంతమంది వ్యాపారులకు వరంగా మారిందా? మాఫియా గ్యాంగ్ ఇసుకను ఫిల్టర్ చేయడానికి ప్రభుత్వం వ్యవసాయానికి ఉచితంగా సరఫరా చేసే కరెంటును వినియోగించుకొని, బోరు ద్వారా మోటార్లతో మట్టి నుంచి ఇసుకను తీసి ఒక దగ్గర స్టోరేజ్ చేస్తున్నారని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కరెంటు మీటర్లు లేకుండా ఎలక్ట్రికల్ వారి పర్మిషన్ లేకుండా అక్రమంగా 24 గంటలు కరెంటు వాడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లుతుందని స్పష్టంగా తెలుస్తుంది. ప్రభుత్వాన్ని కళ్ళు గప్పి,  ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తూ ఉచిత విద్యుత్తును  అక్రమ మార్గంలో వాడుకుంటూ దందాలో లక్షలు గడిస్తున్నారు.
ఈ ఇసుక మాఫియా వాళ్ళు ఇసుకను అమాయక ప్రజలకు అమ్ముతున్న ధర 3500/- అని తెలియ వచ్చింది. సదరు అధికారుల సహాయంతో ఇసుక మాఫియా దొంగలకు మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుందని  ప్రజలు గుసగుసలాడుతున్నారు. పేరు ఉచితం  దోపిడీ నిజం – దోచుకో,  పంచుకో, తీసుకో అనే విధంగా తయారయింది సొసైటీ…
Spread the love