సర్దార్ సర్వాయి పాపన్న స్పూర్తితో కల్లు గీత కార్మిక హక్కుల కోసం ఉద్యమిస్తాం: బుర్ర శ్రీనివాస్ గౌడ్

– కల్లు గీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి
నవతెలంగాణ-గోవిందరావుపేట
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తితో కల్లుగీత కార్మికుల హక్కుల కోసం ఉద్యమిస్తామని కల్లుగీతా కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం మండలంలోని వసర గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373 వ జయంతి కార్యక్రమం గీత కార్మిక సహకార సంఘం (పస్రా రాంపూర్ )సోసైటీ అధ్యక్షులు జక్కు రాజు గౌడ్ అధ్యక్షతన జరిగింది.  ఈ కార్యక్రమం కు ముఖ్యఅతిధిగా హాజరై న బుర్ర శ్రీనివాస్ గౌడ్ హాజరై మాట్లాడుతు నిర్భంధాలకు వివిధ రకాల పన్నుల కు వెట్టిచాకిరీ విముక్తి కోసం సర్వాయి పాపన్న 12 మంది తో యుద్ధం తయారు చేసి 12000 వేల మంది తో సైన్యం ఏర్పాటు చేసి కోని గోల్కొండ కోటపై జెండా ఎగురా వేసిన యుద్ధ వీరుడు సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు.. గత 15 సంవత్సరాలనుండి అధికారికంగా సర్వాయి పాపన్న గౌడ్ జయంతి అధికారికంగా జరుపాలని కిలాషాపూర్ లో కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బస్సు యాత్ర లు చేయడం జరిగిందని అన్నారు.. ప్రభుత్వం అధికారికంగా జయంతి రోజు సెలవు ప్రకటించాలని. జనగామ జిల్లా కు సర్వాయి పాపన్న జిల్లా గా నామకరణం చేయాలనీ డిమాండ్ చేశారు. కల్లు గీత కార్మికుల హక్కుల కోసం సర్వాయి పాపన్న గౌడ్ స్పూర్తితో పోరాటాలకు సిద్ధం కావాలని శ్రీనివాస్ గౌడ్ పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమం లో. జిల్లా నాయకులు పంజాల శ్రీనివాస్ గౌడ్. బూర సురేందర్ గౌడ్ మండలనాయకులు  బుర్ర వేణు గౌడ్. బొమ్మగాని రమేష్ గౌడ్. బొమ్మగాని జానీ గౌడ్. బొమ్మగాని శోభన్ గౌడ్ .జక్కు మొగిలి గౌడ్ జక్కు బిక్షపతి గౌడ్. జక్కు మల్లేష్ గౌడ్. జక్కు రణధీప్ గౌడ్. పూజారి నర్సయ్య గౌడ్. చిదిరాల నాగయ్య గౌడ్. పూజారి సారంగం గౌడ్. కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్.బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్  షణ్ముఖ్ గౌడ్ పూజారి విజయ్ గౌడ్ శ్రీను గౌడ్ తదితరులు 30 మంది గీత కార్మికులు పాల్గొన్నారు.
Spread the love