అసోం నుంచి సాయుధ దళాల చట్టాన్ని ఉపసంహరిచుకోండి

–  కేంద్రానికి రాష్ట్ర మంత్రివర్గం సిఫారసు
గువహతి : సాయుధ బలగాల (ప్రత్యేక అధికారాలు) చట్టం(ఏఎఫ్‌ఎస్‌పీఏ, అలజడి చెలరేగిన ప్రాంతాల చట్టంలను మొత్తం రాష్ట్రం నుంచి ఉపసంహరించుకోవాలని అసోం రాష్ట్ర క్యాబినెట్‌ కేంద్రానికి సిఫారసు చేసింది. రాష్ట్రం నుంచి ఏఎఫ్‌ఎస్‌పీఏను పూర్తిగా ఉపసంహరణకు సంబంధించిన రోడ్‌మ్యాప్‌పై చర్చించడానికి ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షాను కలిసిన నాలుగు రోజుల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకోవటం గమనార్హం. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగాఅవసరమైతే శోధించడానికి, అరెస్టు చేయడానికి, కాల్పులు జరపడానికి ఏఎఫ్‌ఎస్‌పీఏ ఆర్మీ సిబ్బందికి అలజడి చెలరేగిన ప్రాంతాల్లో విస్తృత అధికారాలను ఇస్తుంది. ఈ చట్టం మొదటిసారిగా 1990 నవంబర్‌లో అసోంలో విధించబడింది. భద్రతా పరిస్థితిని సమీక్షించిన తర్వాత ప్రతి ఆరు నెలలకు దీనిని పొడిగిస్తారు.

Spread the love