ధర్మాసనం నుంచి జ్ఞాన్‌వాపి కేసులను ఉపసంహరణ

– అలహాబాద్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉత్తర్వులు
న్యూఢిల్లీ: వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదుపై సవాల్‌కు సంబంధించిన కేసులను అలహాబాద్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రస్తుత ధర్మాసనం నుంచి ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. న్యాయపరమైన హక్కు, క్రమశిక్షణను పేర్కొంటూ ఈ ఆదేశాలిచ్చారు. జస్టిస్‌ ప్రకాష్‌ పాడియా నేతృత్వంలోని సింగిల్‌ జడ్జి బెంచ్‌ నుంచి కేసులను ఉపసంహరించుకోవాలని చీఫ్‌ జస్టిస్‌ ప్రిటింకర్‌ దివాకర్‌ ఆగస్టు 11 నాటి ఒక అడ్మినిస్ట్రేటివ్‌ ఆర్డర్‌లో పేర్కొన్నారు. సీజే దివాకర్‌ ఆగస్టు 28న మరోసారి ఈ ఉత్తర్వులను జారీ చేశారు. బెంచ్‌ను కొత్తగా ప్రతిపాదించాలని కూడా ఆయన పిలుపునివ్వటం గమనార్హం. ”రోస్టర్‌ ప్రకారం సంబంధిత సింగిల్‌ జడ్జి ఈ విషయంలో అధికార పరిధిని కోల్పోయిన తర్వాత కూడా కేసులు అదే కోర్టు ముందు జాబితా చేయబడటం కొనసాగిందని ప్రధాన న్యాయమూర్తి ఉత్తర్వులు పేర్కొన్నాయి. ఈ కేసు వాస్తవాలు విధానపరమైన ఉల్లంఘనకు సంబంధించి మరింత సమస్యాత్మక దృష్టాంతాన్ని సూచిస్తున్నాయని ఆర్డర్‌ పేర్కొన్నది.

Spread the love