
నవతెలంగాణ – రామారెడ్డి
ఇంటికి గేటు బిగించనీయటం లేదని మనస్తాపం చెంది మహిళా ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఇస్సన్నపల్లి గ్రామానికి చెందిన చెట్టుకూరి సాయవ్వ ఇంటికి గేటు బిగించుకోనివ్వకుండా, పక్కింటి వారు అడ్డుకొనడంతో మనస్థాపం చెంది పురుగుల మందు త్రాగి ఆత్మహత్యాయత్నం చేయగా కుటుంబ సభ్యులు, స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారని, చికిత్స పొందుతుందని తెలిపారు.