గృహలక్ష్మిలో మొదటి ప్రాధాన్యత మహిళలకే

– నియోజక వర్గంలో 1.37లక్షల ఎకరాలకు సాగునీరు
– సమిష్టి కృషి ఫలితమే చిల్పూర్‌ ఆత్మీయ సమ్మేళనం
– ఎమ్మెల్యే రాజయ్య
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్‌
గృహలక్ష్మి పథకంలో మొదటి ప్రాధాన్యత మహిళలకేనని మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య అన్నారు. శుక్రవారం చిల్పూర్‌ మండలం పల్లగుట్ట గ్రామంలో శ్రీ వెంకటేశ్వర బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయ ఛైర్మన్‌, బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇంచార్జీ పొట్లపల్లి శ్రీధర్‌రావు ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.ఈ సందర్భంగా బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి ఎంపిపి బొమ్మిశెట్టి సరితా బాలరాజు, నియోజక వర్గ కో-ఆర్డినేటర్‌ కేశి రెడ్డి మనోజ్‌ రెడ్డితో కలిసి పూలమాలవేసి ఘన నివాళి అర్పించారు. పలు పార్టీల నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీలో ఆహ్వానిస్తూ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజక వర్గ ప్రజలని తన జీవిత కాలం ఋణపడి ఉంటానని, కేసీఆర్‌ ఏ పథకం చేయినా రాజకీయాలకతీతంగా ప్రాధాన్యం కల్పిస్తున్న మనసున్న మారాజు కేసీఆర్‌ అన్నా రు. 1100వందల దళిత బంధు యూనిట్లు జనాభా ప్రాతిపదికన, ఆరునూరైనా దళిత కుటుంబాలకు అందజేస్తామని భరోసా ఇచ్చారు. ఎక్కడా కూడా అప్పు తీసు కునే అవకాశం రాష్ట్రానికి ఉన్నా, అడ్డుకుంటూ,రాష్ట్ర అభివృద్ధికి ఆటంకంగా బీజేపీ నిలిచిందన్నారు. ప్రతీ దళిత కుటుంబాన్ని తాను చనిపోయేలోపే లక్షాధికారిని చేస్తానని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఏ సమయంలో ఎన్నికలు వచ్చినా బీ ఆర్‌ఎస్‌ పార్టీని ప్రజల్ని ఆదరించాలని కోరారు. క్షేత్రస్థాయిలో తన వెన్నంటే ఉండి, గొప్పగా పనిచేస్తూ, అనుభవం కలిగిన పార్టీ శ్రేణులకు సముచిత స్థానం కల్పించే బాధ్యత తనదేనన్నారు. రవాణా రంగంలో నియోజక వర్గాలల్లోకెల్లా ముందున్నద ని, లక్షా 37వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. కేసీఆర్‌కు దగ్గరట… అంటే ఒక్కడే ఎమ్మెల్యే రాజయ్యగా అందరూ చెప్పుకుంటున్నారని, తనవళ్లే ఈ ప్రాంతం మరో కోనసీమగా మారిందని అన్నారు. కేసీఅర్‌ పుణ్యమాని, ఇంటింటికి మిషన్‌ భగీరథ నల్లా ద్వారా గోదావరి నీళ్ళను మన ఇంటి ముంగిట్లకు అందిస్తున్న ఘనత కేసీఆర్‌దే అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశమంతా రావా లంటే ప్రధాని కేసీఆర్‌ కావాలని ఆకాంక్షించారు.ఎప్పుడూ ఎన్నికలువచ్చినా సబ్బం డ వర్గాల ప్రజలు కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపర్చాలని పిలుపు నిచ్చారు. మండల ఆత్మీయ సమ్మేళనం జరిగిందంటే అందరి సమిష్టి ఫలితమే అన్నారు. ఈ కార్యక్ర మంలో నియోజక వర్గ కో-ఆర్డినేటర్‌ కేశిరెడ్డి మనోజ్‌ రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బొమ్మిశెట్టి బాలరాజు, క్లస్టర్‌ ఇంఛార్జీలు ఆకుల కుమార్‌, మహేందర్‌ రెడ్డి, మం డల అధ్యక్షుడు రమేష్‌ నాయక్‌, పీఏసీఎస్‌ వైస్‌ ఛైర్మన్‌ చిర్ర నాగరాజు, మండల ప్రధాన కార్యదర్శి శ్యాం సుందర్‌ రెడ్డి, వేల్పుల గట్టేష్‌, ఎంపిటిసి జీడి ఝాన్సీ రాణి, సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌ రంగు రమేష్‌, ఏఎంసి చైర్మన్‌ గుజ్జరి రాజు, డైరెక్టర్లు రాజన్‌ బాబు, హరీష్‌, సరిత, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love