మైనర్లకు మద్యం అమ్మకాలు – ఇష్టారాజ్యంగా పర్మిట్‌ రూములు

రోడ్డుపైనే వాహనాల పార్కింగ్‌
ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
చోద్యం చూస్తున్న ఎక్సైజ్‌ అధికారులు
నవతెలంగాణ-పర్వతగిరి
వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలం లోని పర్వ తగిరి, అన్నారంషరీఫ్‌, చింత నెక్కొండ, ఏనుగల్లు గ్రామాల్లో ఉన్న ఆరు మద్యం షాపులు యజమానులు తమ లాభార్జనే ధ్యేయంగా ఇష్టారాజ్యంగా వ్య వహరిస్తున్నారు . ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి మైనర్లని చూడకుండా చిన్న పిల్లలకే మద్యం అ మ్మకాలు చేపడుతున్నారు. ఇంత జరుగుతున్న ఎక్సైజ్‌ పోలీస్‌శాఖ వారు ఏమాత్రం పట్టినట్టు వ్యవహరిస్తు న్నారని ఆయా గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చే స్తున్నారు. ఏనుగల్లులోని లక్ష్మి నసింహ వైన్స్‌లో శుక్ర వారం మైనర్లకు మద్యం అమ్మకాలు నిర్వహించారు. మైనర్లకు మద్యం అమ్మడంపై ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలు చేపడుతూ విచ్చల విడిగా బెల్టు షాపులకు మద్యం సరఫరా చేస్తున్నారు.
మండలంలో ప్రతీ గ్రామంలో సుమారు 10 నుండి 15 పైగా బెల్టు షాపులు ఉన్నాయి. ఈ బెల్టు షాపుల నిర్వాహకులతో యజమానులు కుమ్మక్కై జీ రో సరుకుతో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జోరు గా జరుపుతున్నారు. అంతేకాక మద్యం షాపుల ముం దు మందుబాబులు ఇష్టారాజ్యంగా వాహనాలు నిల పడంతో అటువైపు వెళ్లే ప్రయాణికులు వాహనదా రులు ఇబ్బందులు పడుతూ యాక్సిడెంట్ల కు గురైన సందర్భాలు సైతం మండలంలో ఎన్నో జరిగాయి. షాపుపక్కనే కొద్ది స్థలంలోనే పర్మిట్‌ రూము ఉండాల్సి ఉండగా వారి ఇష్టారాజ్యంగా పర్మిట్‌ రూములు నిర్వహిస్తూ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని ఆయా గ్రామాల స్థానికులు విచార వ్యక్తం చేస్తున్నా రు. మద్యంషాపుల యజమానులు ఇంతా దోపిడీ చేసిన సంబంధిత అధికారులు స్పందించడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
ఇప్పటికైనా ఎక్సైజ్‌, పోలీస్‌శాఖల అధికారులు సంబంధిత షాప్‌ యజమానులపై తగుచర్యలు తీసు కోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Spread the love