మిసిమిలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని మిసిమి ఉన్నత పాఠశాలలో గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని  పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న మహిళా టీచర్స్ నీ ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్  బాలి రవీందర్ విద్యార్థులను ఉద్దేశించి  మాట్లాడుతూ మహిళల చదువు  దేశానికి ఎంతో ఉపయోగ పడుతుందన్నారు.సమాజంలో మహిళల సమాన హక్కులు కాపాడాలన్నారు. మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని,  వారికి పురుషుల నుండి అన్ని రకాలుగా ప్రోత్సాహం అందినప్పుడే ఉన్నత శిఖరాలను చేరుకుంటారన్నారు. ఇందుకు పురుషులు కూడా తమ వంతు బాధ్యతగా మహిళలకు అన్ని రకాలుగా సహకారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీలు  రాజశ్రీ, శబనాజ్, మాధురి, శ్రీలక్ష్మి, రజిత, కీర్తన, మేఘన, అనూష, నవ్య, మేఘన, జోయా, తదితరులు  పాల్గొన్నారు.
Spread the love