ప్రజాపాలన సేవ కేంద్రం ఏర్పాటు

– సద్వినియోగం చేసుకోవాలి ఎంపీడీఓ అకుల రవీందర్
నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి  మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో  ప్రజా పాలన సేవ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని దినిని సద్వినియోగం చేసుకోవాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి అకుల రవీందర్ సూచించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలం లోని అన్ని గ్రామాలకు చెందిన ప్రజలు ప్రజా పాలనకు సంబంధించి మహలక్ష్మి గ్యాస్ సిలిండర్ సబ్సిడి కొరకు, గృహ జ్యోతి స్కీం కొరకు దరఖస్తూ చేసుకోవాలని యం.పి.డి.ఓ అకుల రవీందర్ తెలిపారు. ఈ దరఖాస్తు కొరకు ప్రజలు రేషన్ కార్డు, కుటుంబ సభ్యుల ఆదార్ కార్డ్స్, కరెంటు బిల్, గ్యాస్ బుక్, గ్యాస్ బిల్ కూడా తీసుకురావాలని వివరించారు.ఇప్పటి వరకు 335 దరఖాస్తు వచ్చాయని, అందులో 175 గృహ జ్యోతి, 119 గ్యాస్ సిలిండర్ సబ్సిడి వచ్చాయని, దానిలో 40 దరఖాస్తు పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Spread the love