ప్రపంచ మలేరియా దినోత్సవం, ర్యాలీ..

నవతెలంగాణ – డిచ్ పల్లి
ప్రాథమిక ఆరోగ్యం ఇందల్ వాయి, పరిధిలోని డిచ్ పల్లి, ఇందల్ వాయి మండల కేంద్రాలలో ప్రపంచ మలేరియా దినోత్సవ ర్యాలీని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ ఏడాది ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా నినాదం “మరింత సమానమైన ప్రపంచం కోసం మలేరియాపై పోరాటాన్ని వేగవంతం చేయడం”.ఈ సందర్భంగా ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్ మాట్లాడుతూ దోమల ద్వారానే వ్యాపించి ప్రబలమైన సమస్య ఇది సకాలంలో గుర్తించి సరైన చికిత్స తీసుకోవడం ద్వారా మలేరియా నుండి బయటపడవచ్చు నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిస్థితి తప్పవు.
లక్షణాలు..
ఈ జ్వరం ఎనాఫిలిస్ దోమ ద్వారా వస్తుంది దీనిలో తీవ్రమైన జ్వరం వచ్చి పోవడం తీవ్రమైన చలి గా ఉండటం లక్షణాలు తలనొప్పి ఒళ్లు నొప్పులు వాంతులు వికారం వంటివి ఉంటాయి కొందరిలో కామెర్లలక్షణాలు కనిపించవచ్చు. ఫాల్స్ ఈ ఫారం మలేరియా అయితే కిడ్నీలు చెడిపోవడం కోమాలోకి వెళ్ళిపోవడం వంటి ప్రమాదాలు ఉంటాయి
చికిత్స: అనుమానం రాగానే మలేరియా పరీక్ష ఉత్తమము యాంటీ మలేరియా మందులు ఎంత త్వరగా మొదలుపెడితే అంత మంచిది కోర్సు మొత్తం పూర్తిగా తీసుకోవడం చాలా చాలా అవసరం. మలేరియా వ్యాధి తగ్గడానికి రక్షణ కవచాన్ని వాడండి- ప్రాణాలను రక్షించుకోండి. దోమలు కుట్టకుండా పుట్టకుండా చూసుకుందాం- మలేరియా తరిమికొడదాం.
ప్రతిరోజు డ్రై డే గా పాటిద్దాం.
మనం చేయాల్సింది..
దోమల నియంత్రణ.. సరైన నివారణ ఇంట్లో ఇంటి పరిసరాల్లో, కాలనీల్లో, గ్రామములో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. కేవలం మన ఇంట్లో చూసుకుంటే చాలదు. మన చుట్టుపక్కల కూడా చైతన్యం తీసుకురావడం అంతా కలిసికట్టుగా ముందుకు కదలడం ముఖ్యము.
దోమతెరలు, కాయిల్స్, యాడ్స్ మస్కిటో, లిక్విడ్, వాడుకోవడం అవసరము. మురికి నీటి పై కిరోసిన్ ఆయిల్ కలిగినట్లయితే నివారించుకోవచ్చు. నీటి నిల్వ ఉండకుండా చూడాలి. పరిసరాల్లో జ్వర బాధితులు ఉన్నప్పుడు ఈ జాగ్రత్తలు ఇంకా తప్పనిసరి పై వాటిని ప్రతి ఒక్కరు పాటించినట్లయితే ఈ వ్యాధి  నుండి బయట పడే మార్గం సులభమవుతుంది.
1)సమాజపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
a) గ్రామములోని వీధులన్నీ శుభ్రంగా ఊడ్చి, మురుగు కాలువలు డ్రైనేజీలు, చెత్త చెదారం తొలగించాలి.
b) వర్షాలకు ముందు తర్వాత మురికి కాలవల్లో పూడికతీత తొలగించాలి మీరు పారు నట్లు చూడాలి.
c) గ్రామ పెద్దలు,ఉపాధ్యాయులు,సామాజిక కార్యకర్తలు,ప్రజల్లో అవగాహన పెంచాలి.
d) వ్యాధులు ప్రబలినప్పుడు ఆరోగ్య సిబ్బందికి తెలియజేసి వారి సలహాలు పాటించాలి.
2) వ్యక్తిగతంగా కుటుంబ పరంగా తీసుకోవలసిన జాగ్రత్తలు:
a) ఇంటి పరిసరాలలో నీరు నిలువకుండా ప్రదేశాలను గుర్తించి వాటిని తొలగించాలి.
b) పనికిరాని పాత్రలు,టైర్లు,తొట్లు, పగిలిపోయిన బకెట్లు ఇంటి పరిసరాలలో ఉండకుండా చూడాలి.
c) ఓరల్ హెడ్ ట్యాంకులు,సంపులు, డ్రమ్ములు, నీటి తొట్ల మీద మూతలు పెట్టాలి.
d) ఇంటి పై కప్పు పైన, సన్ షెడ్ల పైన,టెర్రస్ ల పైన నీరు నిల్వ ఉండకుండా చూడాలి.
e) ప్రతి శుక్రవారం ఫ్రైడే గా చేసి శుభ్రపరిచి ఆరబెట్టి వాడుకోవాలి.
f) ఒకసారి వాడి పడేసిన ప్లాస్టిక్ సంచులు, ప్లాస్టిక్ గ్లాసులు,కప్పులు మురికి కాలవలో పడేయరాదు.
g) సెప్టిక్ ట్యాంక్ గాలి గొట్టాలకు నైలాన్ సంచులు కట్టడం,ఇంటికి,కిటికీ,గుమ్మాలకు మెస్ డోర్ లు అమర్చడం.
h)దోమతెరలు వాడటం అలవాటు చేసుకోవాలి.
3) ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలు:
a) మలేరియా వ్యాధి గ్రస్తులను గుర్తించడం రక్తపరీక్ష ద్వారా నిర్ధారణ వారికి తగిన చికిత్సను అందించడం.
b) ఆరోగ్య శిబిరాల నిర్వహణ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం.
c) ఆరోగ్య కార్యకర్తలు అందరివద్ద రక్త పూతల సేకరణకు చికిత్సకు తగిన సౌకర్యాలు అందచేయడం.
d) వ్యాధి ప్రబలిన చోట దోమలు నియంత్రించడం పొగబెట్టడం.
e) వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఆరోగ్య పరిసరాల పారిశుద్ధ్యం కార్యక్రమాలు అమలు చేయడం.. ఈ కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ అనిత ఆరోగ్య కార్యకర్తలు వెంకట్ రెడ్డి, ఆనంద్, శారద, ఇందిరా ,ఉదయ, రాధిక, అరుంధతి ,భానుప్రియ, స్వరూప,మమత,సంతోషి ,విజయ సావిత్రి, దేవి మేరీ, రేణుక, కావ్య ,గంగుబాయి తో పాటు అరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love