గాయాల పురిటి

wound-healingనవ్వుకునే గాయాల
బాధలన్నింటికీ వీడ్కోలిస్తున్నాను
దుఃఖాన్ని విచిత్రంగా చూస్తే
దూరాన్ని వెతుక్కొని రగిల్చే
నిఘంటువుల్లోకెక్కని గాయం
పెద్దదిగా ఎలా ఉందో చుస్తునాన్నను

మనసు పత్రహరితంలా కాలిపోతున్న
గుండె చప్పుళ్ళకి
కనిపిస్తున్న ఉరితాడులై
వ్యవహార సందిగ్ధం ఎలా చెప్తారు
అంతులేని సష్టి మధనాన్ని
మూసుకుపోయినట్లు తెగొట్టుకున్ననారు
గుండె గాయలాన్ని తాలుకా తాకేటట్లు
పొలిమేర నడుమ బిగపట్టినట్లు
ఎప్పుడో ఒకరోజు వెలుగే తిరా రేఖ మిగిలే ఉంది

గాయాలని వెతకాలంటే
దారులన్ని మూసుకుపోయినారు
అన్ని కాంక్రిట్‌ బాటలే
ఉరివెంట వీడియోస్‌ చూస్తున్నట్టు అనిపిస్తుంది
ఒకానొక సందర్భంలో
కొమ్మరాలిన జ్ఞాపకాలపూలనడుగు చెప్తారు
తాలూకా గాయాలు మనకేం తెలుసు
శిధిలా వ్యవస్థ గాయమే సందిగ్ధం
ఏదో ఒకరోజు నిక్షిప్తం అవుతుంది

గాయమనేది ఉందా అని
ప్రయోగాత్మక హెచ్చరికలు జారీ చేస్తుంటారు
గాయానికి మించిన నిజ నాయకుడు లేడు
అప్పుడెప్పుడో దిక్కులు కోల్పోయినప్పుడు
గాయం ఏం ఎరగనట్లు నటిస్తుంటారు
కథల మత్తుల్లో కూరుకుపోయిన
ఎముకలు కుళ్ళిన శవంలా ఉండకపోవచ్చు
మహాదుర్మార్గపుల అన్ని నేనే అని మురిస్తే
తగ్గిన గాయం నాగరిక
జీవంలా మటుమాయం కాకపోవచ్చు
కాంపౌండ్సెర్ఫిలో లో చూస్తే రెటీనాలా కనిపిస్తుంది

రెక్కల దారుల్లో కిటికీలోపాల్లోనుంచి
పీచులు పెడుతూ ఉంటారు
మనుషుల కోసం మేలుకొలిపిన
ఎదురు చూపిన నిబ్బరం
సత్కారాలతో ఆరగింపులు మొదలైనారు
కొత్త కీర్తిని రెప్ప చాటున వెతుకుతున్నప్పుడు
విప్లవ ఛాయని సష్టిస్తుంది
– బూర్గు గోపికష్ణ,
7995892410

Spread the love