ట్రెండ్ సష్టించాలన్నా… స్టైల్ ని ఫాలో అవ్వాలన్నా కుర్ర’కారు’ ఎప్పుడూ స్పీడే. దుస్తుల నుంచీ, యాక్ససరీస్ వరకూ కొత్త ఫ్యాషన్ ని ఫాలో అవుతూనే ఉంటుంది నేటి యువతరం. అమ్మాయి, అబ్బాయిల యాక్ససరీస్‌లో మరింత స్టైల్‌గా ముందుంటాయి ‘లెదర్ కఫ్స్’. బంగారం, వెండి,స్టెయిన్ లెస్ స్టీలూ, బ్లాక్ మెటల్, రబ్బర్ వాచీలు, బ్రేస్‌లెట్ స్థానంలో లెదర్ కఫ్స్ అందాలు ధగధగలాడుతున్నాయి. వీటి వెడల్పు అంగుళం నుంచి మూడు అంగుళాల వరకూ ఉంటుంది. డిజైన్ల సంగతి సరేసరి. రంగురంగులతో మెరిసిపోతుంటాయి. బ్లాక్ కలర్ ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. అమ్మాయిల కఫ్ బ్రేస్‌లెట్లలో ఆకర్షణీయమైన బకెల్ లేదా లాకెట్లు అమర్చినవి ఎక్కువగా లభిస్తున్నాయి. బకెల్ ఉంటే అది అదనపు ఆకర్షణే. బటన్స్, పక్షులు, కీటకాల బొమ్మలు అందాన్ని ద్విగుణీకతం చేస్తాయి. వాచీలు కూడా కఫ్స్ మధ్యలో ఫిక్స్ చేసి ఉండటం మనం చూడొచ్చు.
– ఆనంద ‘మైత్రేయ’మ్, హైదరాబాద్