నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మీ కుటుంబ సేవలు మరువలేనివని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు కొనియాడారు. మద్నూర్ మండల మాజీ ఎంపీపీ మాజీ జెడ్పిటిసి దంపతుల కుమారుడైన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు రామ్ పటేల్ జన్మదిన వేడుకలు మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో కేక్ కట్ చేయించి ఎమ్మెల్యే స్వీట్ తినిపించారు. జన్మదినం సందర్భంగా ఆ యువ నాయకునికి ఎమ్మెల్యే శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆ నాయకుడు ఎమ్మెల్యేకు సన్మానించి ఆశీర్వాదాలు పొందారు. ఈ జన్మ దిన వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.