నవతెలంగాణ-వీణవంక
యువత స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలని వీణవంక సర్పంచ్ నీల కుమారస్వామి సూచించారు. మండల కేంద్రంలోని కల్వల రోడ్డులో వీణవంకకు చెందిన నీల కిరణ్ నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ మహాళక్ష్మి మెస్ ను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయం ఉపాధితో ముందుకెళ్లాలనే ఆలోచన వచ్చి హోటల్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు, వార్డు సభ్యుడు తాల్లపల్లి మహేష్, వార్డు సభ్యులు రెడ్డి రాజుల భిక్షపతి, నీల మొండయ్య, గ్రామస్తులు నీల పున్నంచందర్, గడ్డం రాంచదర్ తదితరులు పాల్గొన్నారు.