నవతెలంగాణ-కుభీర్
మండలంలోని ఆయా గ్రామాల్లో ఉన్న యువత మత్తు పానీయాలకు బానిస కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కుభీర్ ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని డోడర్నా గ్రామంలో ఏర్పాటు చేసిన గంజాయి గస్తీ పై గ్రామ ప్రజలకు, యువకులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ముఖ్యంగా గ్రామాల్లో ఉన్న యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి మంచి భవిష్యత్తును నాశనం చేసుకోవడం జరుగుతుందని సూచించారు. దీంతో చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా మంచి ఉన్నత చదువులు చదివి కొలువులు సాధించేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని యువతకు సూచించారు. మత్తు పదార్థాల వల్ల తమ కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉంటుందని వారికి సూచించారు. అదేవిధంగా సైబర్ క్రైమ్ వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందని వాటి వల్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. యువత వాహనాలు నడిపేటప్పుడు రోడ్డు జాగ్రత్తలు పాటించి స్థానానికి సంబంధించిన అన్ని పత్రాలు హెల్మెట్లు ధరించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
మత్తు పదార్థాలకు యువత బానిస కావద్దు: ఎస్సై
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



