సర్పంచ్ ముక్కాముల శ్యామలశేఖర్
నవతెలంగాణ-కట్టంగూర్
పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని స్థానిక సర్పంచ్ ముక్కామల శ్యామలశేఖర్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా శుక్రవారం మండల కేంద్రములో గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మొక్కలను నాటి వాటిని సంరక్షించడం ద్వారా పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుందన్నారు. అనంతరం గ్రామపంచాయతీ ఆవరణలో మొక్కలను నాటారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీధర్ రెడ్డి, ఉపసర్పంచ్ గుండు రాంబాబు,వార్డు సభ్యులు ఏకుల సుజాత సైదులు,కళ్ళేo నాగేశ్వరరావు, శ్రీరామ్ సంధ్య వీరేశం, కానుగు శ్రీను, యరుకల శశిధర్,ముషం ఉమేష్, ఫీల్డ్ అసిస్టెంట్ నిర్మల సిబ్బంది ఉన్నారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



