కాంగ్రెస్ పార్టీలో చేరిన యువకులు

నవతెలంగాణ – రామగుండం-: హనుమాన్ టెంపుల్ 1వ డివిజన్ కు చెందిన యువకులు గురువారం కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్, ఈసంపల్లి అంజులు,మరియు బల్వాన్ సింగ్ ఆధ్వర్యంలో సతీష్ ,సమ్మాయ,మహేష్ ,గోపాల్ ,సాధనందం బొల్లా రాజ్ కుమార్, శివాజీ, తో పాటు 50 మంది యువకులు కాంగ్రెస్ పార్టీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు.. ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ.. పేద ప్రజలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు.. కెసిఆర్ ప్రభుత్వం మాయమాటలతో మోసం చేస్తున్నారని రానున్న ఎన్నికల్లో ఏసు ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరారు.. నిరంతరం ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇదునూరి హరి ప్రసాద్ మాజీ కార్పొరేటర్ మొహమ్మద్, BC cell జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేష్ ,యూత్ కాంగ్రెస్ రామగుండం నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ నజీమ్ ,SC సెల్ కార్పొరేషన్ అధ్యక్షుడు యుగేందర్, రిశెట్టి సతీష్ ,గౌస్ బాబా, తదితరులు పాల్గొన్నారు.

Spread the love