నవతెలంగాణ- పశ్చిమ బెంగాల్: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకు భద్రతను పెంచాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. గంగూలీ భద్రతను జడ్ కేటగిరీకి అప్‌గ్రేడ్ చేయాలని బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ‘గంగూలీకి కల్పించిన వై కేటగిరీ భద్రత పదవీ కాలం మంగళవారంతో ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వివిఐపి యొక్క భద్రతా కవర్ గడువు ముగిసినందున ప్రోటోకాల్ ప్రకారం సమీక్ష జరిగింది. గంగూలీ భద్రతా వలయాన్ని జడ్ కేటగిరీకి పెంచాలని నిర్ణయించబడింది’ సదరు అధికారి తెలిపారు.