అటుకుల పులిహోర కలిపేద్దాం

పులిహోర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అయితే పులిహోర చేయాలంటే ప్రత్యేకంగా అన్నం వండాలి. చింతపండు రసాన్ని తయారు చేసుకోవాలి. ఆ తర్వాత బాగా కలిపాలి. అప్పుడే టేస్ట్‌ అదురుద్ది. కానీ అదంతా టైమ్‌ టేకింగ్‌ అని అనుకుంటున్నారా? అయితే మీరు అటుకుల పులిహోరను ట్రై చేయండి. పిల్లలకు వేగంగా లంచ్‌ బాక్స్‌ సిద్ధం చేయాలంటే.. దీనికి మించిన మంచి రెసీపి మరొకటి ఉండదు. చాలా ఈజీగా కేవలం 10 నుంచి 15 నిమిషాలలోపే అటుకుల పులిహోర కలిపేయొచ్చు. అదెలాగో చూడండి. కావలసిన పదార్థాలు: ఒక కప్పు అటుకులు, కరివేపాకు రెండు రెమ్మలు, కాస్త కొత్తిమీర (మీ పిల్లలకు ఇష్టం లేకపోతే పక్కన పెట్టండి), రెండు నిమ్మకాయలు లేదా రెండు టేబుల్‌ స్పూన్ల నిమ్మరసం, తగినంత ఉప్పు, కొన్ని వెల్లులి, అల్లం ముక్కలు, పావు టీస్పూన్‌ పసుపు, అర టీస్పూన్‌ జీలకర్ర, మూడు మిర్చీలు (పెద్దవైతే రెండు చాలు), రెండు టేబుల్‌ స్పూన్ల పల్లీలు. ఇలా చేయండి: ముందుగా ఒక కప్పు అటుకులు తీసుకుని నీటిలో నానబెట్టండి. ఆ తర్వాత వాటిని వడపోసి పక్కన పెట్టండి. ఎక్కువ తడి లేకుండా, బాగా పొడిబారకుండా మధ్యస్థంగా ఉండేలా అటుకులు ఉండాలి. ఎక్కువ తడిగా ఉంటే వేడి చేసేప్పుడు మెత్తగా అయిపోతాయి. మరోవైపు స్టవ్‌ మీద పెనం పెట్టి, కాస్త ఆయిల్‌ వేసి అందులో వెల్లులి, అల్లం ముక్కలు, కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, పల్లీలను సన్నని మంటపై దోరగా వేయించండి. కాస్త పసుపు వేసిన తర్వాత.. పక్కన పెట్టుకున్న అటుకులను పెనంలో వేసి బాగా కలపండి. అది స్టవ్‌ మీద వేడెక్కుతున్న సమయంలో.. నిమ్మరసాన్ని తీసుకోండి. అందులో తగినంత ఉప్పు వేసి బాగా కలపండి. ఆ రసాన్ని పెనం మీద ఉన్న అటుకుల్లో వేయండి. అంతే అటుకుల పులిహోర రెడీ. స్టవ్‌ ఆపేసి అటుకుల పులిహోరను ఒక గిన్నెలోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్‌ చేస్తే మరింత అందంగా కనిపిస్తుంది. మన అటుకుల పులిహోరను ఉత్తరాదిలో పోహా అంటారు. దీనికి టమోటాలు, బఠాణీలు, కాస్త మిక్చర్‌ కూడా యాడ్‌ చేస్తే పొహాగా మారిపోతుంది. మీకు టైమ్‌ ఉన్నట్లయితే నిమ్మరసానికి బదులుగా చింతపండు రసంతో కూడా అటుకుల పులిహోర చేయొచ్చు. ఇది నిమ్మరసం అటుకుల పులిహోర కంటే మాంచి టేస్ట్‌ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం.. ఈ రోజే అటుకుల పులిహోర ట్రై చేయండి. పిల్లలకు కూడా ఇది కొత్తగా ఉంటుంది. ఒక్కసారి టేస్ట్‌ చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు. పైగా అటుకులు ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. అటుకులు డయాబెటిస్‌ బాధితులకు కూడా మంచివే. పైగా మీరు ఇందులో నిమ్మరసం కలుపుతారు కాబట్టి.. అటుకుల పులిహోర మరింత హెల్తీ. ప

Spread the love