ఎన్నో ప్రాజెక్టులు పూర్తి చేశాం.. మంత్రి హరీశ్‌రావు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సాగు, తాగు నీళ్ల గురించి రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన వైఖరి ఉందనీ, అందుకే ఎన్నో ప్రాజెక్టులు పూర్తిచేశామని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు చెప్పారు. శనివారం శాసన సభలో పద్దుల పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక ప్రాజెక్టులను తమ హయాంలోనే నిర్మించామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ నాయకుల వ్యాఖ్యలను తప్పు బట్టారు. కాంగ్రెస్‌ పాలకుల నిర్లక్ష్యం వల్లే పాలమూరు వాసులు వలసలు పోయారని గుర్తుచేశారు.ప్రాజెక్టులు నిర్మిస్తే వారు ఎందుకు వలసలు పోయారో చెప్పాలని కాంగ్రెస్‌ పక్ష నేత భట్టి విక్రమార్కను ప్రశ్నించారు. గోదావరిలో ప్రతి నీటి చుక్క ను వినియోగించుకుంటున్నామని చెప్పారు. కొత్తగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టటం వల్లనే సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. కాళేశ్వరంపై బురదజల్లే ప్రయత్నం చేయొ ద్దని హితవు పలికారు. ఆ ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తిచేశామనీ, దాంతో సాగు, తాగు, పరిశ్రమల అవసరాలు తీరుతున్నా యని వివరించారు. కృష్ణా నది నీటి వాటా గురించి పోరాటం చేస్తున్నామన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో నెట్టం పాడు, కల్వకుర్తి, భీమా ప్రాజెక్టుల కింద కేవలం 27,300 ఎకరాలు మాత్రమే పారిం దని పేర్కొన్నారు. ‘కాంగ్రెస్‌ హయాంలో పంపు హౌజ్‌లు పూర్తి కాలేదు..దాంతో కాలువలు నిర్మించలేదనీ, పంపులు, మోటార్లు గడ్డ మీద పెట్టింది నిజం కాదా’? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం, రూ.3,663 కోట్లను ఖర్చుపెట్టి అసంపూర్తి గా ఉన్న మూడు ప్రాజెక్టులను పూర్తి చేసి రూ.5.69 లక్షల ఎకరాలకు నీరందించిం దని తెలిపారు. టీడీపీ హయాంలో ప్రాజెక్టు ల వద్ద బాబు కొబ్బరి కాయలు కొట్టగా కాంగ్రెస్‌ హయాంలో ప్రాజెక్టుల వద్ద రాజ శేఖర్‌రెడ్డి మొక్కలు నాటి డ్రామాలు ఆడారని ఎద్దేవా చేశారు. 13.9.22న పాలమూరు డీపీఆర్‌ను కేంద్రానికి సమర్పించామని చెప్పారు.రాయలసీమ లిప్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు మీద 12.5.22 నాడు కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు మీటింగ్‌లో అభ్యంత రం వ్యక్తం చేశామని తెలిపారు. ఎన్‌జీటీ, కేఆర్‌ఎంబీతో ఏపీ ప్రభుత్వానికి పనులు ఆపాలని ఉత్తర్వులు ఇప్పించగలిగామని చెప్పారు. వీటితో పాటు మిషన్‌ కాకతీయ ద్వారా చెరువుల మరమ్మతులు చేపట్టి, పెద్ద సంఖ్యలో చెక్‌ డ్యాంలు నిర్మించడం వల్ల పాలమూరు పచ్చబడి, వలసపోయిన వారు వాపసు వచ్చారని ఆయన స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి..
కృష్ణా నదిలో తెలంగాణ వాటా తేల్చటంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు న్నదని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. ఈ విషయంలో కేంద్ర జలవనరుల శాఖ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవటం లేదని చెప్పారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నాన్చుడు ధోరణి వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్ట జరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన న్యాయబద్దమైన వాటాను తేల్చటంలో తాత్సారం, మొండి వైఖరి ఎందుకని ప్రశ్నించారు. ఈ విషయం లో ఇక్కడున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు నోరు మెదపటం లేదని ఎద్దేవా చేశారు.
పేదలకు కార్పొరేట్‌ స్థాయిలో వైద్య సేవలు అందించటమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి హరిశ్‌రావు చెప్పారు. ప్రయివేటు ఆస్పత్రులపై ఇప్పటివరకు ఎలాంటి నియం త్రణ లేదనీ, వాటిపౖౖె నియంత్రణ తీసుకొ చ్చేందుకు క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌ యాక్ట్‌ను తీసు కురావడానికి ప్రభుత్వం ఆలోచిస్తుం దని చెప్పారు. పేదలకు తగిన వైద్య సేవలు అందించే ఉద్దేశంతోనే జిల్లాకో మెడికల్‌ కాలేజీలను తీసుకొస్తున్నామని తెలిపారు. మెడికల్‌ కాలేజీ వస్తే ప్రొఫెసర్లు వస్తారనీ,.. 650 పడకల ఆస్పత్రి వస్తుందనీ,.. ఆపరే షన్‌ థియేటర్లు వస్తాయని చెప్పారు. దీని ద్వారా పేద ప్రజలకు వాళ్ల జిల్లాలోనే కార్పొరేట్‌ వైద్యం అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ నలువైపులా నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తున్నట్టు తెలిపారు.
ఎల్బీనగర్‌, ఎర్రగడ్డ, ఆల్వాల్‌, గచ్చిబౌలి లో 4200 పడకలతో నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను.. నిమ్స్‌లో 2వేల పడకలతో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల ను.. వరంగల్‌లో 1100 కోట్లతో 2వేల పడకలతో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తున్నామని తెలిపారు. దాదాపు 10 వేల సూపర్‌ స్పెషా లిటీ పడకలను పేద ప్రజలకు అందుబాటు లోకి తీసుకొస్తున్నా మని వివరించారు. ఈ 10 వేల పడకలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా కార్పొరేట్‌ సేవల ందించే దిశగా ప్రభుత్వం వెళ్తోందని తెలి పారు.

Spread the love