నేడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవ సభ

Telangana armed peasantry today
Struggle Anniversary Assembly–  హాజరుకానున్న బృందాకరత్‌
–  ఐలమ్మ ఆర్ట్‌ గ్యాలరీలో ఫోటో ఎగ్జిబిషన్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సీపీఐ (ఎం) ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ సభను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 11 గంటలకు బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని ఐలమ్మ ఆర్ట్‌ గ్యాలరీలో ఫొటో ప్రదర్శనను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఎగ్జిబిషన్‌ను సీనియర్‌ అడ్వకేట్‌ విద్యాసాగర్‌ ప్రారంభిస్తారు. 11.30 గంటలకు అక్కడి సుందరయ్య పార్కు వద్ద భారీ బహిరంగ సభను నిర్వహిస్తారు. ఈ సభకు సీపీఐ (ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌ ముఖ్యవక్తగా హాజరుకానున్నారు. అనంతరం సుందరయ్య పార్కు నుంచి ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ వరకూ ప్రదర్శన నిర్వహిస్తామని సీపీఐ (ఎం) హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ కార్యదర్శి ఎమ్‌.శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Spread the love