ఘనంగా కె. విశ్వనాథ్‌ జయంతి

‘తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివద్ధికి తెలంగాణ ప్రభుత్వ సహకారం ఎప్పటికీ ఉంటుంది’ అని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు.బుధవారం హైదరాబాద్‌లని సాంస్కతిక కళా సంస్థ ఆకతి నిర్వహణలో, వెస్ట్‌ మారేడ్‌ పల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో దర్శక దిగ్గజం కె.విశ్వనాథ్‌ 93వ జయంతిని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,’కె విశ్వనాథ్‌ తెలుగు చలన చిత్ర దశ, దిశలను మహోన్నత శిఖరాలకు చేర్చిన మహనీయుడు. ఎందరో కళాకారులు విశ్వనాథ్‌ చిత్రంలో ఒక్కసారైనా నటించాలని కలలు కంటారు. అలాగే ఒక్క చిత్రంలో నటించిన ‘సప్తపది’ సబితకు ఆయనతో పనిచేసిన మధుర స్మతులు ఎల్లకాలం గుర్తుండి పోతాయి’ అని అన్నారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన తెలంగాణ చలన చిత్ర అభివద్ధి సంస్థ చైర్మన్‌ అనిల్‌ కూర్మా చలం మాట్లాడుతూ,’స్వతహాగా మంచి నర్తకి అయిన సబిత ‘సప్తపది’ చిత్రంలో తమ సహజ నటనను ప్రదర్శించారు. ‘శంకరా భరణం’, ‘సప్తపది’ చిత్రాల తరువాత సంప్రదాయ కళలైన నత్యం, సంగీతాలను కళాకారులు తమ వత్తిగా స్వీకరించి ముందుకు వెళ్ళడం విశేషం’ అని చెప్పారు. ఈ వేడుకకు ఆకతి సుధాకర్‌ స్వాగతం పలుకగా, పలువురు సినీ, రాజీకయ కళాభి మానులు పాల్గొని, దర్శక దిగ్గజం కె.విశ్వనాథ్‌ ప్రతిభని కొనియాడారు.
ఈ వేడుకలో ‘సప్తపది’ చిత్ర కథానాయిక సబితను మంత్రి శాలువా, జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు.

Spread the love