నవంబర్‌ 10న రిలీజ్‌

పంజా వైష్ణవ్‌ తేజ్‌, శ్రీలీల జంటగా నటిస్తున్న భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఆదికేశవ’. ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్‌ ఎన్‌ రెడ్డి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీలీలతో పాటు జోజు జార్జ్‌, అపర్ణాదాస్‌ ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఈనెల 18 నుంచి నవంబర్‌ 10కి వాయిదా వేస్తున్నట్లు చిత్ర బందం అధికారికంగా ప్రకటించింది. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ ప్యారిస్‌లో జరిగింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ చివరి దశలో ఉంది. జి.వి.ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి మొదటి పాటను త్వరలో విడుదల చేయబోతున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్‌ సమర్పిస్తోంది. నవీన్‌ నూలి ఈ చిత్రానికి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

Spread the love