ప్రేక్షకుల్ని మెస్మరైజ్‌ చేసే గాండీవధారి అర్జున

వరుణ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటించిన యాక్షన్‌ ఎమోషనల్‌ థ్రిల్లర్‌ ‘గాండీవధారి అర్జున’. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఈనెల 25న గ్రాండ్‌ రిలీజ్‌ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల రిలీజైన ట్రైలర్‌, సాంగ్‌కి వచ్చిన రెస్పాన్స్‌ తర్వాత సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ పెరిగాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది. 2 గంటల 18 నిమిషాలుగా మేకర్స్‌ ఈ సినిమా రన్‌టైమ్‌ను లాక్‌ చేశారు. సినిమాను చూసిన సెన్సార్‌ సభ్యులు చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఆకట్టుకునే యాక్షన్‌ సీక్వెన్స్‌లతో పాటు సినిమాలోని మంచి మెసేజ్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్‌ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.
వరుణ్‌ తేజ్‌ సరసన సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నాజర్‌, విమలా రామన్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నటీనటులు నటన, సాంకేతిక నిపుణుల ప్రతిభ ప్రేక్షకులకు ఓ అమేజింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుంది. యూనిక్‌ స్టోరీలతో సినిమాలను డైరెక్ట్‌ చేసే బ్రిలియంట్‌ ఫిల్మ్‌ మేకర్‌ ప్రవీణ్‌ సత్తారు తనదైన పంథాలో ఈ సినిమాను ఎంటర్‌టైనింగ్‌గానే కాకుండా ప్రేక్షకులపై మంచి ప్రభావాన్ని చూపేలా తెరకెక్కించారు.
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. మిక్కీ జె.మేయర్‌ సంగీతం అందించిన ఈ సినిమాకు ముఖేష్‌ సినిమాటోగ్రాఫర్‌గా, అవినాస్‌ కొల్ల ఆర్ట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేశారు.

Spread the love