ఆ రేంజ్‌లో.. సౌండ్‌ పార్టీ

In that range.. Sound partyవీజే సన్నీ హీరోగా ఫుల్‌ మూన్‌ మీడియా ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.1 రూపొందుతున్న చిత్రం ‘సౌండ్‌ పార్టీ’. హ్రితిక శ్రీనివాస్‌ హీరోయిన్‌. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్‌ గజేంద్ర నిర్మాతలు. జయ శంకర్‌ సమర్పణ. సంజరు శేరి దర్శకుడు.
ఈ సినిమా రిలీజ్‌కి సిద్ధమవుతున్న సందర్భంగా శుక్రవారం దర్శకుడు సంపత్‌ నంది చేతుల మీదుగా ఈ చిత్ర టీజర్‌ లాంచ్‌ వేడుక ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, ‘టీజర్‌ బావుంది. మోహిత్‌ చేసిన మ్యూజిక్‌ కూడా చాలా బావుంది. ఈ చిత్రం మరో జాతిరత్నాలు సినిమాలా ఉండబోతున్నట్లు టీజర్‌ చూస్తే అర్థమవుతుంది’ అని తెలిపారు. ‘ఫుల్‌ ఎంటర్‌టైన్మెంట్‌ ఉన్న చిత్రమిది. సెప్టెంబర్‌లో సినిమాను గ్రాండ్‌ గా రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం’ అని నిర్మాత రవి పోలిశెట్టి అన్నారు. సమర్పకుడు జయశంకర్‌ మాట్లాడుతూ, ‘దర్శకుడు సంజరు ఒక కొత్త తరహా కామెడీని ఈ సినిమా ద్వారా ఇంటర్‌డ్యూస్‌ చేస్తున్నాడు’ అని చెప్పారు. ‘ఈ సినిమా మరో జాతిరత్నాలు రేంజ్‌లో ఉండబోతుంది’ అని దర్శకుడు సంజరు శేరి తెలిపారు. హీరో వీజే సన్ని మాట్లాడుతూ, ‘శివన్నారాయణ, నేను తండ్రీకొడుకులుగా నటించాం. సినిమా అంతా ఇద్దరం ఫుల్‌గా నవ్విస్తాం’ అని అన్నారు.

Spread the love