ప్రేమంటే ఏమిటంటే..?

ప్రేమ! ఒక మధుర భావన, మానసికోద్వేగం, ఊగించి శాసించే కలాపం, క్షణం నిలువనివ్వని తపన. హృదయాన్ని ఊరడించే మధురస్వప్నం. మనసుని మెత్తగా హత్తుకునే ఒక ఆత్మీయ భావం. మనం నిత్యం వినే మాట ప్రేమ.. ప్రేమ.. ప్రేమ… అనే పదం వినపడని రోజంటూ ఉండదు. పల్లె, పట్నం, నగరం ఎక్కడైనా ప్రేమ స్వరాలు వినిపిస్తూనే ఉంటాయి. ప్రేమకి సంబంధించిన నిజాలు, అబద్ధాలు పుకార్లు కలగలిసి షికార్లు చేస్తుంటాయి. ఆర్థిక స్థోయి, సామాజిక స్థాయి ఏదైనా ప్రేమ పరవశం కోసం మనుషులు ఆరాటపడుతుంటారు. అలాంటి ప్రేమ యువతను ఒక్కోసారి పక్కదోవ పట్టిస్తుంది. సమస్యనూ సృష్టిస్తుంది. మరి అలాంటి సమస్యల్లో పడకూడదంటే అసలు ప్రేమంటే ఏమిటో ఈరోజు మానవిలో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా…
– సునీత బండారు, కవయిత్రి.
మహబూబ్‌నగర్‌

ప్రేమిస్తున్నారా.. ఒక్క క్షణం ఆగండి…
అమ్మాయి టీన్స్‌లోకి వచ్చిందంటే వలపు తలపులు మొదలవుతాయి. ఆకర్షణలు పెరుగుతాయి. అందులోనూ ఈ మధ్య ప్రతివారి చేతిలోనూ సెల్‌ ఫోన్‌. పైగా దానిని అవసరాలకి మించి ఆడంబరాలకి వాడటం ఫ్యాషన్‌ అయిపోయింది. చదివిన చదువులకు సరైన ఉద్యోగం సంపాదించే అవకాశాలు అందివ్వని సమాజం. ఇలా ఎన్నో, ఎన్నెన్నో కారణాలు నేటి అమ్మాయిలు ప్రేమ అనే ఎండమావి వెనక పడటానికి కారణాలు. ఈ మధ్య చదువుకున్న అమ్మాయిలు వరుణ్ణి ఎంచుకోవటంలో చాలా జాగ్రత్త పడుతున్నారని, అబ్బాయిలకు వివాహం కావటం కష్టమవుతున్నదని కొందరు తల్లుల ఆందోళన. ఇలాంటివారు ప్రేమలో పడ్డా పర్వాలేదు. ఎదుటివారిని గుడ్డిగా నమ్మి ఏ పనీ చెయ్యరు. కానీ ఎక్కువగా చదువుకోని అమ్మాయిలు, యుక్త వయసులో ఆకర్షణకి లోనయి జీవితాలు నాశనం చేసుకునే సంఘటనలు ఎక్కువగా వున్నాయి. కొంచెం డబ్బున్నవాడిగా కనబడి నాలుగు ప్రేమ కబుర్లు చెప్పగానే తాము హీరోయిన్స్‌ అనుకుంటారు. తాము లేనిదే తమ ప్రేమికుడు బతకలేడు అనుకుంటారు. ఇలా అన్యాయమయ్యే ఆడపిల్లల జీవితాలు ఏమవుతున్నాయో ఎన్నో చూస్తున్నాం. అయితే మీరు నమ్మవలసిన నిజం ఇంకోటి వుంది. సినిమాల్లో హీరోల్లాగా మిమ్మల్ని కాపాడటానికి ఎవరూ రారు. అన్యాయమయిపోయిన ఆడ పిల్లలు తాము మనుష్యులమని మరచిపోయి రోజు రోజూ చస్తూ బతకాల్సి వుంటుందని. అమ్మా నాన్నల ముద్దుల పట్టి మీరు. అందం వున్నా లేకపోయినా, ఆస్తి వున్నా లేకపోయినా మీరూ ఒక మనిషి. మీకూ మనసుంది. దానికి మీరెలా బతకాలో ఒక అవగాహన వుందో లేదో చూసుకోండి. కాస్త తెలివిగా మీ జీవితాన్ని దిద్దుకోండి. ఒక అబ్బాయి అంటే ఇష్టపడటంలో తప్పేమీ లేదు. అయితే అతని మనస్తత్వం, అలవాట్లు, కుటుంబం, అన్నీ తెలుసుకోండి. ఆ కుటుంబంవారు మిమ్మల్ని వాళ్ళ కుటుంబంలోకి అంగీకరిస్తారో లేదో కూడా గ్రహించండి. అమ్మాయిలూ, మీరూ మనుష్యులేనమ్మా. ఆకర్షణా, ప్రేమ, పెండ్లి ఇవే కాదు జీవిత ఆశయాలు. ముందు మీరు అవకాశం వున్నంతమటుకూ చదువుకోండి. చదువు విచక్షణా జ్ఞానం ఇస్తుంది. అన్నింటికన్నా ముందు మీ జీవితంలో మీరు నిలదొక్కుకోండి. స్త్రీకైనా, పురుషుడికైనా ఆర్ధిక స్వావలంబన అత్యవసరం. ముందు మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. కూలి చేసినా, పదవులేలినా మీ ఆర్ధిక స్వాతంత్య్రం మీకుండేటట్టు చూసుకోండి. మరి అవతల వ్యక్తి ఆర్ధిక స్తోమతు కూడా అతను పెట్టే ఖర్చుబట్టి కాకుండా అతను చేసే పనిబట్టి తెలుసుకోండి. తియ్యని మాటలకి పొంగిపోయే గుణం మానుకోండి. ఆలోచన పెంచుకోండి. ఆడపిల్ల పెండ్లి గురించి తల్లిదండ్రులు ఎన్నో ఆలోచనలు చేస్తారు. తమ కూతురుకి మంచి సంబంధం తెచ్చి పెండ్లి చెయ్యాలనే చూస్తారు. వాళ్ళకన్నా మీ శ్రేయస్సు కోరేవారు వుండరు. మీ ప్రేమని వారికి విషయం చెప్పండి. వారు అంగీకరించకపోతే ఆవేశంలో నిర్ణయం తీసుకోవద్దు. కారణాలు తెలుసుకోండి. వాటిని అధిగమించగలరో లేదో ఆలోచించండి. ప్రేమ అంటే ఇవాళ ప్రేమ, రేపు పెండ్లి కాదు.. జీవితం. పెండ్లికి గుర్తింపు కూడా అవసరం. పెద్దలు చేసే పెండ్లిగానీ, చట్టబద్దమైన పెండ్లిగానీ చేసుకోండి. ఇరువైపు పెద్దలూ ముఖ్యులే. వాలెంటైన్స్‌ డే అని సంతోషంగా సంబరాలు జరుపుకోవటం కాదు. మీ జీవితంలో చక్కని రాజ బాటలో పయనించి జీవితాంతం సంతోషంగా వుండండి.
– పి.యస్‌.యమ్‌.లక్ష్మి,
కవయిత్రి, మహబూబ్‌నగర్‌

పారా హుషార్‌
నేడు బాలికలు, యువతులు, వివాహితలపై జరుగుతున్న దాడులను చూసి మనసు ద్రవించిపోతుంది. దిశ చట్టాలు ఎన్ని వచ్చినా మహిళల పట్ల తీరు మారడం లేదు. కుటుంబం నుంచే అక్కాచెల్లెళ్ల అనుబంధాలను, కుటుంబ బాంధవ్యాలను స్నేహితుల మమతానురాగాలను తెలుపుతూ సమాజంలో మానవ సంబంధాలను బలోపేతం చేయాలి. తల్లిదండ్రులు గురుతర బాధ్యత తీసుకొని తమ కొడుకులు, కూతుర్లు ఎక్కడికి వెళుతున్నారో, ఎప్పుడు వస్తున్నారో, ఎక్కడి నుంచి వస్తున్నారో ఒక కంట కనిపెడుతూ వారికి స్నేహపూర్వకంగా విద్యాబుద్ధులు నేర్పాల్సిన బాధ్యత వారికి ఉండాలి. నవ నాగరిక సమాజంలో ఆటవిక రాజ్యాన్ని అంతం చేయాలి. తాను అనుకున్నది సాధించాలనే తపనతో తమ తల్లి, చెల్లి కూడా ఒక స్త్రీ అని మరచిపోతూ ఇతరులపై హింసకు పూనుకుంటున్న నేటితరం భవిష్యత్తు అగమ్య గోచరం. యువతపనైనే కాక వృద్ధాప్యంలో కొట్టుమిట్టాడుతున్న ముసలి వాళ్లను, చివరకు పసిమొగ్గల పైన కూడా అరాచకత్వాన్నికి పాల్పడడం సిగ్గుచేటు. తరతరాలుగా మహిళలు ఎదుర్కొంటున్న అవమానాలను, హింసా ధోరణులను, హత్యలను, లైంగిక దాడులను అరికట్టాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరికీ ఉంది. తెలిసీ తెలియని వయసులో ప్రేమ అంటూ వెంటపడుతూ తమ భవిష్యత్తును పాడు చేసుకుంటున్న వారిని ఎంతో మందిని మనం చూస్తున్నాం. ప్రేమ పేరుతో రహస్యంగా ఫొటోలు, వీడియోలు చిత్రీకరిస్తున్న గుర్తు తెలియని వ్యక్తులు వాటికి అసభ్య కామెంట్లు జోడించి యూట్యూబ్‌ ఛానెళ్లలో అప్‌లోడ్‌ చేస్తున్నారు. బయటికి వెళ్ళిన బిడ్డలు మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చే వరకు కూడా మనం సందేహంతో ఎదురుచూస్తూనే ఉంటాము. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న వారి నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవడానికి ప్రాథమిక తరగతి నుంచే స్త్రీ విద్యను ప్రవేశపెట్టాలి. ఆత్మ రక్షణ కొరకై తరగతులు నిర్వహించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని కోల్పోకుండా మనోధైర్యాన్ని మనసులో నింపాలి.
– సునీత బండారు, కవయిత్రి.
మహబూబ్‌నగర్‌

అమ్మాయిలూ ఆలోచించండి
ప్రేమ ఈ రెండు అక్షరాలు ఎంత శక్తివంతమైనవో అందరికీ తెలుసు. అరిటాకు ముల్లు అనేది పాత సామెత అయినా ప్రేమ ప్రయాణంలో అధికంగా బాధపడుతున్న వారు అమ్మాయిలే. చదువు, తెలివితేటలు, ఆర్థిక అస్తిత్వం, ఆత్మవిశ్వాసం అన్నీ వున్నా ప్రేమ విషయంలో యువతులు బోల్తా పడుతూనే వున్నారు. అందుకే యువతులు యుక్తితో మెలగాలి. ఆకర్షణకి ప్రేమకి తేడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ప్రేమ స్నేహం ఏ బంధం అయినా భావోద్వేగాలు అదుపులో వుంటే విపత్కర పరిస్థితుల్లో కృంగి పోకుండా వుండవచ్చు. ప్రస్తుత కాలంలో బోరు ఫ్రెండ్‌ లేడు అంటే ఏదో లోపంగా భావిస్తున్నారు. ఇది కేవలం అవతలి వ్యక్తి భ్రమ అని గుర్తించాలి. స్నేహితులకి చూపించు కోడానికి ప్రేమలో పడాల్సిన అవసరం లేదు. చదువుకునే చోట, పని చేసే చోట, ఇంటి దగ్గర ఎక్కడైనా సరే ప్రలోభాలకు లొంగి ప్రేమలో పడి ఆ తర్వాత ఇబ్బందులు పడవద్దు. వయసుకు తగ్గట్టు ఆలోచన చేస్తూ అడుగు ముందుకు వెయ్యాలి. ముందు చదువు, ఆర్థిక సామర్థ్యం ఆ తర్వాతే ప్రేమ, పెండ్లి అని స్థిర నిర్ణయం తీసుకోవాలి. అవసరం అయినప్పుడు అదే నిర్ణయం మీ వాళ్ళకి, మీకు ప్రేమ ప్రపోజల్‌ పెట్టిన వారికి తెలిపే ధైర్యమూ వుండాలి. ప్రేమ అనే ఒక్క ఎమోషన్‌, నిర్ణయం మీ జీవితాన్ని తారుమారు చేస్తుంది తస్మాత్‌ జాగ్రత్త. ఇన్ని ఆలోచించి చేస్తే అది ప్రేమ ఎలా అవుతుంది అని అనుకుంటే పెండ్లి తర్వాత తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయి. ”ప్రేమ ఎప్పుడు ఎక్కడ ఎవరిమీద ఎలా పుడుతుందో తెలీదు”ఇలాంటీ సినిమా డైలాగులకు ప్రభావితం కావద్దు. మీరు ఎలాంటి భవిష్యత్తు కోరుకుంటున్నారు దానికి ఆ వ్యక్తి సరిపోతాడా లేదా కచ్ఛితంగా ఆలోచించాలి. ఇక ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తుంటే తక్షణమే ఇంట్లో వారికి, పోలీసులకి తెలియజేయాలి. నలుగురికీ తెలిస్తే పరువు పోతుంది జంకుతే సమస్య జటిలం అవుతుంది. అభిరుచి వుండడం తప్పు కాదు కానీ కేవలం బాహ్య సౌందర్యం చూసి ప్రేమికుడిని ఎన్నుకోవడం నూటికి నూరు శాతం తప్పు. అసలు ప్రేమికుడిని ఎన్నుకోవడం అంటే జీవితాన్ని ఎన్నుకోవడం అని గుర్తు పెట్టుకోవాలి. అమ్మాయిలూ మీరు ప్రేమిస్తున్నా ప్రేమలో మునిగి తేలుతున్న, ప్రేమలో బోల్తా పడుతున్నా ఒక్క విషయం గుర్తుంచుకోండి. జీవితం ఎక్కడా ఆగిపోదు. పోవద్దు. పయాణం సాగుతూనే ఉంటే ప్రేమ ఒక మధుర జ్ఞాపకంగా మిగిలి పోతుంది. విఫలమైతే విషాద పడి ఆగిపోతే ఆ ప్రభావం జీవితాంతం వుండి పోతుంది. అమ్మాయిలూ ఆలోచించండి.
– ముదిగొండ రాజ చంద్రిక,
కవయిత్రి.

ప్రేమిస్తున్నారా.. ఒక్క క్షణం ఆగండి…
అమ్మాయి టీన్స్‌లోకి వచ్చిందంటే వలపు తలపులు మొదలవుతాయి. ఆకర్షణలు పెరుగుతాయి. అందులోనూ ఈ మధ్య ప్రతివారి చేతిలోనూ సెల్‌ ఫోన్‌. పైగా దానిని అవసరాలకి మించి ఆడంబరాలకి వాడటం ఫ్యాషన్‌ అయిపోయింది. చదివిన చదువులకు సరైన ఉద్యోగం సంపాదించే అవకాశాలు అందివ్వని సమాజం. ఇలా ఎన్నో, ఎన్నెన్నో కారణాలు నేటి అమ్మాయిలు ప్రేమ అనే ఎండమావి వెనక పడటానికి కారణాలు. ఈ మధ్య చదువుకున్న అమ్మాయిలు వరుణ్ణి ఎంచుకోవటంలో చాలా జాగ్రత్త పడుతున్నారని, అబ్బాయిలకు వివాహం కావటం కష్టమవుతున్నదని కొందరు తల్లుల ఆందోళన. ఇలాంటివారు ప్రేమలో పడ్డా పర్వాలేదు. ఎదుటివారిని గుడ్డిగా నమ్మి ఏ పనీ చెయ్యరు. కానీ ఎక్కువగా చదువుకోని అమ్మాయిలు, యుక్త వయసులో ఆకర్షణకి లోనయి జీవితాలు నాశనం చేసుకునే సంఘటనలు ఎక్కువగా వున్నాయి. కొంచెం డబ్బున్నవాడిగా కనబడి నాలుగు ప్రేమ కబుర్లు చెప్పగానే తాము హీరోయిన్స్‌ అనుకుంటారు. తాము లేనిదే తమ ప్రేమికుడు బతకలేడు అనుకుంటారు. ఇలా అన్యాయమయ్యే ఆడపిల్లల జీవితాలు ఏమవుతున్నాయో ఎన్నో చూస్తున్నాం. అయితే మీరు నమ్మవలసిన నిజం ఇంకోటి వుంది. సినిమాల్లో హీరోల్లాగా మిమ్మల్ని కాపాడటానికి ఎవరూ రారు. అన్యాయమయిపోయిన ఆడ పిల్లలు తాము మనుష్యులమని మరచిపోయి రోజు రోజూ చస్తూ బతకాల్సి వుంటుందని. అమ్మా నాన్నల ముద్దుల పట్టి మీరు. అందం వున్నా లేకపోయినా, ఆస్తి వున్నా లేకపోయినా మీరూ ఒక మనిషి. మీకూ మనసుంది. దానికి మీరెలా బతకాలో ఒక అవగాహన వుందో లేదో చూసుకోండి. కాస్త తెలివిగా మీ జీవితాన్ని దిద్దుకోండి. ఒక అబ్బాయి అంటే ఇష్టపడటంలో తప్పేమీ లేదు. అయితే అతని మనస్తత్వం, అలవాట్లు, కుటుంబం, అన్నీ తెలుసుకోండి. ఆ కుటుంబంవారు మిమ్మల్ని వాళ్ళ కుటుంబంలోకి అంగీకరిస్తారో లేదో కూడా గ్రహించండి. అమ్మాయిలూ, మీరూ మనుష్యులేనమ్మా. ఆకర్షణా, ప్రేమ, పెండ్లి ఇవే కాదు జీవిత ఆశయాలు. ముందు మీరు అవకాశం వున్నంతమటుకూ చదువుకోండి. చదువు విచక్షణా జ్ఞానం ఇస్తుంది. అన్నింటికన్నా ముందు మీ జీవితంలో మీరు నిలదొక్కుకోండి. స్త్రీకైనా, పురుషుడికైనా ఆర్ధిక స్వావలంబన అత్యవసరం. ముందు మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. కూలి చేసినా, పదవులేలినా మీ ఆర్ధిక స్వాతంత్య్రం మీకుండేటట్టు చూసుకోండి. మరి అవతల వ్యక్తి ఆర్ధిక స్తోమతు కూడా అతను పెట్టే ఖర్చుబట్టి కాకుండా అతను చేసే పనిబట్టి తెలుసుకోండి. తియ్యని మాటలకి పొంగిపోయే గుణం మానుకోండి. ఆలోచన పెంచుకోండి. ఆడపిల్ల పెండ్లి గురించి తల్లిదండ్రులు ఎన్నో ఆలోచనలు చేస్తారు. తమ కూతురుకి మంచి సంబంధం తెచ్చి పెండ్లి చెయ్యాలనే చూస్తారు. వాళ్ళకన్నా మీ శ్రేయస్సు కోరేవారు వుండరు. మీ ప్రేమని వారికి విషయం చెప్పండి. వారు అంగీకరించకపోతే ఆవేశంలో నిర్ణయం తీసుకోవద్దు. కారణాలు తెలుసుకోండి. వాటిని అధిగమించగలరో లేదో ఆలోచించండి. ప్రేమ అంటే ఇవాళ ప్రేమ, రేపు పెండ్లి కాదు.. జీవితం. పెండ్లికి గుర్తింపు కూడా అవసరం. పెద్దలు చేసే పెండ్లిగానీ, చట్టబద్దమైన పెండ్లిగానీ చేసుకోండి. ఇరువైపు పెద్దలూ ముఖ్యులే. వాలెంటైన్స్‌ డే అని సంతోషంగా సంబరాలు జరుపుకోవటం కాదు. మీ జీవితంలో చక్కని రాజ బాటలో పయనించి జీవితాంతం సంతోషంగా వుండండి.

ప్రేమంతే ఒత్తిడుల
వడగళ్ళ వానలుంటాయి
సమస్యల సుడిగుండాలుంటాయి
అడుగడుగునా అన్ని పరీక్షలుంటాయి
ఆర్థిక సంక్షోభాలుంటాయి
శాడిస్టుల హత్యలుంటాయి
తట్టుకొని నిలబడలేకపోతే
ఆత్మహత్యల ఆలింగనాలుంటాయి
ప్రేమంతే గులాబీపువ్వు కాదు
ఆకు ఆకుకు పొంచి ఉన్న ముల్లు
ప్రేమంటే మకరందం తాగి
ఎగిరిపోయే తుమ్మెద కాదు
పరిమళాన్ని వెదజల్లే పుష్పం
ప్రేమంతే మొబైల్లో నొక్కే పదం కాదు
గుండెమీద నిలుపుకునే
కోహినూరు వజ్రం
– జి.విజయలక్ష్మి, జర్నలిస్టు

Spread the love