మోతిలాల్‌ నాయక్‌ దీక్ష విరమణ

మోతిలాల్‌ నాయక్‌ దీక్ష విరమణ– నేటి నుంచి పోరాటం తీవ్రం చేస్తానని వెల్లడి
– నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్రంలోని నిరుద్యోగుల డిమాండ్ల కోసం గాంధీ ఆస్పత్రిలో తొమ్మిది రోజులు నిరాహార దీక్ష చేసిన తెలంగాణ నిరుద్యోగుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జేఏసీ) నాయకుడు మోతిలాల్‌ నాయక్‌ మంగళవారం కొబ్బరి నీళ్లు తాగి దీక్షను విరమిం చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లా డారు. అన్న పానీయాలు లేకుండా దీక్ష చేస్తున్నందున ఆరోగ్యం సహకరించడం లేదని, క్రియాటిన్‌ లెవల్స్‌ పెరిగి.. కిడ్నీ, లివర్‌ పాడయ్యే పరిస్థితికి రావడంతో దీక్ష విరమించినట్టు చెప్పుకొచ్చారు. నిరుద్యోగుల డిమాండ్ల కోసం తొమ్మిది రోజులు దీక్ష చేశానని, ఈ దీక్షతో ఒక్క ఉద్యోగం కూడా పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి నుంచి తీవ్ర పోరాటం చేస్తానని చెప్పిన మోతిలాల్‌.. 50వేల ఉద్యోగాలు వచ్చే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిం చారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా నిరుద్యోగుల సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదని, ఇతర రాష్ట్రాల పెత్తనం పోయినా తెలంగాణ యువత బతుకులు మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిరుద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పిన కాంగ్రెస్‌.. ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేయడం లేదని విమర్శించారు. 25-35 ఏండ్ల వయ స్సున్న యువత ఉద్యోగాల కోసం కండ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తు న్నారని, వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కారిస్తామని హామీనిస్తే సరిపోదని, ప్రభుత్వం జీవోలను రిలీజ్‌ చేసే వరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలే తప్ప, తాను నిరాహార దీక్ష చేపట్టడానికి వేరే డిమాండ్లేవీ లేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేయడం, రిక్రూట్‌ మెంట్‌ పరీక్షలకు నోటిఫికేషన్‌ జారీ చేయడంలో విఫలమైందన్నారు. ఈ ప్రభు త్వానికి రాజకీయాలపై ఉన్న శ్రద్ధ విద్యార్థులు, నిరుద్యోగులపై లేదన్నారు. మనుషులు చచ్చిపోయినా పట్టించుకోకపోవడం ప్రజాపాలనా..? అని ప్రశ్నిం చారు. తన ఫోన్‌ లాక్కుని ఎవరితోనూ మాట్లాడనీయకపోవడం సరికాదన్నారు.
ప్రధాన డిమాండ్లు ఇవే..
1.డీఎస్సీని పోస్టు పోన్‌ చేసి.. మెగా డీఎస్సీ రిలీజ్‌ చేయాలి
2.గ్రూప్‌-1 మెయిన్స్‌ ఎలిజిబిలిటీ 1:100కు పెంచాలి
3.గ్రూప్‌-2లో 2వేలు, గ్రూప్‌-3లో 3వేల ఉద్యోగాలు కలపాలి
4.జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలి
5.25వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలి.
6.గురుకుల ఉపాధ్యాయ పోస్టులను బ్యాక్‌లాగ్‌లో ఉంచకూడదు.
7.నిరుద్యోగులకు రూ.4వేల భృతి, 7 నెలల బకాయిలు ఇవ్వాలి.

Spread the love