రోగనిరోధక శక్తిని పెంచుతాయి

మారుతున్న సీజన్‌తో చాలా మంది దగ్గు, జలుబు, వైరల్‌ ఫీవర్‌, అలర్జీ వంటి అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. బలహీనమైన రోగనిరోధక శక్తి కారణంగా ఇటువంటి సమస్యలు తలెత్తుతాయి. దీన్ని నివారించడానికి మన రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా ముఖ్యం. మన శరీరంలోని రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సీజనల్‌ పండ్లు, కూరగాయలను తీసుకోవడం చాలా అవసరం. సీజన్‌ మారుతున్న కొద్దీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే కొన్ని పండ్లు మీకు మేలు చేస్తాయి. అందుకే మీరు తినే ఆహారంలో ఈ ఐదు పండ్లను చేర్చుకోవడం వల్ల మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అంతే కాదు బరువు నియంత్రణలో కూడా ఇవి చాలా సహాయపడతాయి. ఇంతకీ ఆ పండ్లు, వాటి ప్రయోజనాలేంటో చూద్దాం…
బొప్పాయి: అన్ని సీజన్లలో చాలా సులభంగా లభించే పండ్లలో బొప్పాయి పండు ఒకటి. ఈ పండును ఆహారంలో భాగం చేసుకుంటే జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ పండు బరువు నియంత్రణకు కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. మంచి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
స్ట్రాబెర్రీ: స్ట్రాబెర్రీ వసంత రుతువులో ఉత్తమ పండుగా పరిగణించబడుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. అదనంగా స్ట్రాబెర్రీలు ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడంలో కూడా చాలా ప్రభావవంతంగా ఉంటాయి.
బ్లాక్‌బెర్రీ: బ్లాక్‌బెర్రీలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్‌, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. బ్లాక్‌బెర్రీ మెదడు ఆరోగ్యానికి మంచిది. అంతేకాకుండా బ్లాక్‌ బెర్రీ శరీరంలోని జీవక్రియను వేగవంతం చేయడంలో, మధుమేహం లక్షణాలను నియంత్రించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది.
చెర్రీస్‌: శక్తిని పెంచడంలో, నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో, మన మనసును విశ్రాంతిగా ఉంచడంలో చెర్రీస్‌ ఉపయోగపడతాయి. అంతేకాకుండా చెర్రీస్‌ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో రక్తంలో యూరిక్‌ యాసిడ్‌ను తగ్గించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.
నారింజ: సాధారణంగా మనలో చాలామంది చలికాలంలో చలి కారణంగా ఈ పండ్లను తినరు. అయితే ఆరెంజ్‌ శీతాకాలపు పండు. నారింజలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడతాయి. ప

Spread the love