ఆహారంలో పాము పిల్ల కలకలం.. 10 మంది విద్యార్థులకు అస్వస్థత

నవతెలంగాణ – బిహర్; బిహార్‌లోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థుల ఆహారంలో పాము పిల్ల కలకలం రేపింది. దీంతో 10 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. ఆహారంలో చచ్చిపోయిన పాము పిల్ల వచ్చినట్లు స్టూడెంట్స్ ఆరోపించారు. గతంలోనూ ఫుడ్ విషయమై ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోలేదని వాపోయారు. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. మెస్ ఓనర్‌కు పెనాల్టీ విధించినట్లు పేర్కొన్నారు.

Spread the love