చిరుత దాడిలో 12 మందికి గాయాలు

Leopard-Attackనవతెలంగాణ – జమ్మూకశ్మీర్‌
జమ్మూకశ్మీర్‌లో ఓ చిరుతపులి దాడికి దిగిన ఘటన కలకలం సృష్టించింది. ఈ ఘటనలో 12 మంది గాయపడ్డారు. అనంత్‌నాగ్ జిల్లాలోని సల్లార్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అటవీ ప్రాంతం నుంచి జనవాసాల్లోకి వచ్చిన చిరుత ప్రజలపై దాడి చేసిందని అధికారులు పేర్కొన్నారు. దీంతో గాయపడిన వారిని ప్రాథమిక చికిత్స కోసం తొలుత సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అనంత్‌నాగ్‌లోని జీఎంసీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. చిరుతను పట్టుకునేందుకు అధికారులు రంగంలోకి దిగారు.

Spread the love