టీఆర్ఎస్ లో చేరిన 200 మంది ఇందుర్ మెకానిక్ అసోసియేషన్ సభ్యులు

నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల చంద్ర శేఖర్ కాలనీ సోనీ గెస్ట్ గౌస్ లో ఇందుర్ వాటర్ పంప్ మెకానిక్ అసోసియేషన్ సభ్యులని బీఆర్ఎస్ పార్టీ లోకి ఖండువ కప్పి ఆహ్వానించారు. నూతనంగా ఎన్నికైన నగర ఇందుర్ వాటర్ పంప్ మెకానిక్ అసోసియేషన్ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ లో చేరిన సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. బీఆర్ఎస్ పార్టీ లో క్రీయాశీలంగా పనిచేయండి. నిజామాబాద్ నగరం జరుగుతున్న అభివృద్ధి – సంక్షేమ పథకాలని ప్రజలకు తెలియచేయండి. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో ని తెలంగాణ ప్రభుత్వం కుల మత లింగ బేదం లేకుండా అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నారు. కుల వృత్తుల మీద ఆధార పడిన వారికి 1 లక్షల రూ. సబ్బిడి కింద తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో అందచేస్తున్నాము.దళిత బంధు పథకం కింద 10 లక్షల రూ.లు అందించి దళితుల జీవితాల్లో వెలుగులు నింపింది ప్రభుత్వం. కులవృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్న వారికి 250 యూనిట్ల విద్యుత్ ని ఉచితంగా అందిస్తున్నాము. మైనారిటీ సంక్షేమం కోసం సబ్బిడి రుణాలు అందిస్తున్నాము. వృద్దులకు, వికలాంగులు, బీడీ కార్మికులకు,చేనేత కార్మికులకు, వితంతువులకు పింఛన్లు అందిస్తూ ఆసరా నిలుస్తుంది మన టిఆర్ఎస్ ప్రభుత్వం. సామాన్య నిరు పేద వారికి నాణ్యమైన విద్యను అందించుట కొరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకుల పాటశాలలు ఏర్పాటు చేసి ఒక విద్యార్థికి 1 లక్ష 20 వేయిల రూ.ఖర్చు చేస్తూ కార్పొరేట్ విద్యను అందిస్తుంది ప్రభుత్వం.విదేశాల్లో చదువుకొనే విద్యార్థులకు ఓవర్సీస్ విద్య నిధి ద్వారా స్కాలర్షిప్ లు ఇస్తున్నాము.గడిచిన 9 ఏండ్ల కాలం లో విద్య ,ఉపాధి,వ్యవసాయ రంగం లో గణనీయ పురోగతి సాధించాము. నిజామాబాద్ నగరం లో ప్రతి నెల 40000 మందికి ఆసరా పింఛన్లు ఇస్తున్నాము. నగరం లో సంక్షేమ పథకాలు రాని ఇల్లు లేదు. న్యూ కలెక్టరేట్ రోడ్డు లో ఐటి హబ్ నిర్మిస్తున్నాము.నిజామాబాద్ ప్రాంతా యువతకు ఉపాధి అందించడమే ప్రథమ కర్తవ్యం.నిజామాబాద్ నగరం నిర్మించిలో ట్రాఫిక్ కష్టాలు తీర్చడం జరిగింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజి పనులని యుద్ధ ప్రాతికన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకవచ్చాము. నిజామాబాద్ నగరాన్ని 1000 కోట్ల రూపాయలతో సుందరంగా తీర్చిదిద్దాము.నూతనంగా చేరిన వాటర్ అసోసియేషన్ సబ్యులకు బీఆర్ఎస్ పార్టీ లో చేరిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేస్తూ పార్టీ లో క్రియాశీలక పాత్ర పోషించాలని కోరుతున్నాను. అసోసియేషన్ సబ్యులకు ఏ సమస్య వచ్చినా ఒక సోదరునిల అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్ ,నుడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, కార్పొరేటర్ లు అబ్దుల్ కుద్దుస్, బాబ్ల్యూ ఖాన్, సాయి వర్ధన్, విక్రమ్ గౌడ్, మాజీ కార్పొరేటర్ చాంగు భాయ్, నాయకులు నవీద్ ఇక్బల్, అహ్మద్ అసోసియేషన్ సభ్యులు సాయిలు, రషీద్, లక్ష్మణ్, సత్య నారాయణ, నర్సింలు, సలీమ్, అజర్ అలీ, పద్మ కర్, సాజిద్ అలీ, ఖాజా బేగ్, ఖలీద్ బేగ్,పాషా కలీమ్ టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Spread the love